Allu Arjun | హైదరాబాద్ : జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్న అల్లు అర్జున్ను చూసి కుటుంబ సభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు. తన సతీమణి, పిల్లలను అల్లు అర్జున్ ఆలింగనం చేసుకున్నారు. ఇక తన కోసం వచ్చిన అభిమానులకు అల్లు అర్జున్ అభివాదం చేశారు. అనంతరం కుటుంబ సభ్యులు అల్లు అర్జున్‌కు గుమ్మడికాయతో దిష్టి తీసి ఇంట్లోకి తీసుకెళ్లారు.
చంచల్‌గూడ జైలు నుంచి నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లిన అల్లు అర్జున్.. సుమారు గంటకు పైగా అక్కడే ఉన్నారు. 45 నిమిషాల పాటు న్యాయవాదుల బృందంతో చర్చలు జరిపారు. అనంతరం అభిమానులకు అభివాదం చేసుకుంటూ అల్లు అర్జున్ తన వాహనం ఎక్కారు.
ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. అభిమానులందరికీ కృతజ్ఞతలు. నాకు అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు. నేను చట్టాన్ని గౌరవించే పౌరుణ్ని. చట్టానికి కట్టుబడి ఉంటాను. సంధ్య థియేటర్లో జరిగిన ఘటన ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు. బాధిత కుటుంబానికి మరోసారి సానుభూతి తెలుపుతున్నాను. నేను సినిమా చూసేందుకు వెళ్లినప్పుడు అనుకోని ఘటన జరిగింది. కేసు కోర్టులో ఉన్నందున దాని గురించి మాట్లాడను. 20 ఏళ్లుగా థియేటర్‌కు వెళ్లి సినిమా చూస్తున్నా. నా సినిమాలే కాదు.. నా మామయ్యల సినిమాలు చూశాను. బాధిత కుటుంబానికి జరిగిన నష్టం పూడ్చలేనిది. బాధితురాలు రేవతి కుటుంబానికి బాసటగా ఉంటాను. అభిమానం, ప్రేమతో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నేను న్యాయాన్ని నమ్ముతున్నా. నేను బాగున్నాను.. ఎవరూ ఆందోళన చెందొద్దు అని అల్లు అర్జున్ తెలిపారు.
అల్లు అర్జున్ ఇంటి వద్ద ఉద్విగ్న క్షణాలు pic.twitter.com/ttnqryyczR
— Telugu Scribe (@TeluguScribe) December 14, 2024
ఇవి కూడా చదవండి..
Allu Arjun: చట్టాన్ని గౌరవిస్తా: అల్లు అర్జున్
Allu Arjun: అండర్ ట్రయల్ 7697.. మంజీరా బరాక్‌లో అల్లు అర్జున్
Arbitration | కోర్టుకు పోకుండానే కేసుల పరిష్కారం..