జయశంకర్ భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి(Jayashankar Bhupalpally) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్‌తో (Electric shock)ఎలక్ట్రీషియన్ మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన కొత్తపల్లి (ఎస్ ఎం) గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివారలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన నాలుక రవి (50) అనే ఎలక్ట్రీషియన్ కరెంటు మోటార్ రిపేరు చేస్తూ విద్యుత్ షాక్‌తో మంగళవారం ఉదయం మృతి చెందాడు.
గ్రామంలో మొరంచ వాగు వద్ద ఓ రైతు కరెంటు మోటార్ చెడిపోవడంతో రిపేరు చేయడానికి వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వం దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, రవి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Also Read..
Allu Arjun | శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అర్జున్.. వీడియో