హైదరాబాద్: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడిన బాలుడు శ్రీతేజ్‌ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) పరామర్శించారు. సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్‌కు చేరుకున్న బన్ని.. అక్కడ చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అల్లు అర్జున్‌తోపాటు తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా ఉన్నారు. కాగా, అల్లు అర్జున్ హాస్పిటల్ రావడంతో కిమ్స్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
కిమ్స్ ఆస్పత్రికి చేరుకున్న అల్లు అర్జున్
సంధ్య థియేటర్ ఘటనలో గాయపడ్డ శ్రీతేజను పరామర్శించేందుకు బేగంపేట్‌లోని కిమ్స్ ఆస్పత్రికి చేరుకున్న అల్లు అర్జున్
కిమ్స్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు https://t.co/Cd8R8Y1pHc pic.twitter.com/3RrwuLc2xW
— Telugu Scribe (@TeluguScribe) January 7, 2025