అమరావతి : గేమ్ ఛేంజర్ ( Game Changer) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరై తిరిగి వెళ్తున్న ఇద్దరు అభిమానులు దుర్మరణం చెందడం పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 4న తూర్పు గోదావరి ( East Godavari ) జిల్లా రాజమహేంద్రవరం శివారులో నిర్వహించిన గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
కాకినాడకు చెందిన మణికంఠ, చరణ్ అనే ఇద్దరు అభిమానులు వేడుకకు హాజరై తిరిగి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ఈవెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొన పవన్ కల్యాణ్ రోడ్డు ప్రమాదంపై ఆవేదన వ్యక్తం చేస్తు మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున సహాయాన్ని ప్రకటించారు.
ఈ సందర్భంగా కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ బాధిత కుటుంబాలను పరామర్శించి రూ. 5లక్షల చెక్కును అందజేశారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రకటించారు.