మహబూబ్‌నగర్ : ధాన్యం కొనుగోళ్లలో(Grain purchases) జాప్యంపై రైతులు మండిపడితున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంపై ఊరూరా ఆందోళనలు చేపడుతున్నారు. రోజులు గడుస్తున్నా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం గోపన్‌పల్లి గ్రామంలో నేటికీ వడ్లు కొనుగోలు ప్రారంభించలేదంటూ ఆగ్రహించిన రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
ఎంతో కష్టపడి పంటలు పండిస్తే ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కల్లాల్లోనే ధాన్యం మొలకెత్తుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను(Revanth Reddy effigy) ట్రాక్టర్‌కి కట్టి ఊరేగించిన అనంతరం దహనం చేశారు.
ఇవి కూడా చదవండి