రాజన్న సిరిసిల్ల : రాష్ట్రంలో చేనేత కార్మికుల(Handloom worker) ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం నుంచి ఆదరణ కరువై నేతలన్నలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఓ వెలుగు వెలిగిన చేనేత రంగం నేడు ఆర్డర్లు లేక వెలవెలబోతున్నాయి. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో నేత కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జిల్లా కేంద్రంలోని(Siricilla district) ఎర్రం కొమ్రయ్య (55) అనే వ్యక్తి ఇంట్లో ఊరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతునికి భార్య కమల, ఇద్దరు కొడుకులు శ్రీకాంత్, సాయి కిరణ్, కూతురు వరలక్మి ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.