Bulldozer Justice: ఇండ్లను కూల్చడం రాజ్యాంగ వ్యతిరేకం.. అధికారులకు పెనాల్టీ విధించాలి: సుప్రీంకోర్టు
Bulldozer justice: సుప్రీంకోర్టు ఇవాళ కీలక తీర్పునిచ్చింది. ఓ నేరానికి చెందిన నిందితుడో లేక దోషి ఇంటిని కూల్చడం సరికాదు అని కోర్టు చెప్పింది. క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ ఆధారంగా బుల్డోజర్లకు పనిపెట్టడం అక్రమం, రాజ్యాంగ వ్యతిరేకమని కోర్టు తెలిపింది.
న్యూఢిల్లీ: బుల్డోజర్ల(Bulldozer justice) న్యాయంపై సుప్రీంకోర్టు ఇవాళ కీలక వ్యాఖ్యలు చేసింది. ఎగ్జిక్యూటివ్ అధికారులు న్యాయ ప్రక్రియను తమ చేతుల్లోకి తీసుకోవడం సరికాదు అని సుప్రీంకోర్టు తెలిపింది. నిందితులను దోషిగా చిత్రీకరించలేమని, దాని ఆధారంగా వాళ్ల ప్రాపర్టీలను నాశనం చేయడం సరికాదు అని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. కేవలం నిందితులో లేక దోషులో అయినంతమాత్రానా, వాళ్ల ఇండ్లను కూల్చడం రాజ్యాంగవ్యతిరేకమే అవుతుందని సుప్రీంకోర్టు చెప్పింది.
వివిధ నేరాల్లో నిందితులుగా ఉన్న వారి ఇండ్లను అక్రమంగా కూల్చుతున్నారని వేసిన పిటీషన్‌పై సుప్రీంకోర్టు న్యాయవిచారణ చేపట్టింది. జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసుల్లో తీర్పును ఇచ్చింది. నిందితుల ఇండ్లను కూల్చడం రాజ్యాంగ వ్యతిరేకం అని, అలాంటి చర్యలకు పాల్పడిన అధికారులపై పెనాల్టీ వేయాలని కోర్టు సూచించింది.
నిందితులు, దోషులకు కొన్ని హక్కులు ఉంటాయని కోర్టు చెప్పింది. బుల్డోజర్ల న్యాయంపై దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను జారీ చేసింది. రాత్రికి రాత్రే మహిళలు, చిన్నారులను వీధుల్లో చూడడం సంతోషకరమైన అంశం కాదు అని కోర్టు వెల్లడించింది. ఇండ్లను, అక్రమ ప్రాపర్టీలను ధ్వంసం చేసే ప్రక్రియను వీడియో తీయాలని సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నది. ప్రజాభూమిలో అక్రమ నిర్మాణం చేపడితే తమ ఆదేశాలు ఆ కేసుల్లో అమల్లోకి రావు అని కోర్టు తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

