Coolie | తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) ఇటీవలే వెట్టైయాన్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చాడని తెలిసిందే. కాగా తలైవా టైటిల్ రోల్లో నటిస్తోన్న తాజా చిత్రం కూలీ (Coolie) కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే లాంచ్ చేసిన కూలీ టైటిల్ టీజర్లో బంగారంతో డిజైన్ చేసిన ఆయుధాలు, వాచ్ ఛైన్లతో సూపర్ స్టార్ చేస్తున్న స్టైలిష్ యాక్షన్ పార్ట్ సినిమాపై అంచనాలు పెంచేస్తూ.. సూపర్ బజ్ క్రియేట్ చేస్తోంది.
కోలీవుడ్ నుంచి రాబోతున్న మోస్ట్ ఎవెయిటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కూలీకి సంబంధించి చాలా రోజుల తర్వాత విడుదల తేదీ వార్త ఒకటి తెరపైకి వచ్చింది. ఈ చిత్రాన్ని హాలీడేన విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అన్నీ అనుకున్నట్టుగా కుదిరితే కూలీ చిత్రాన్ని మే 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఇదే నిజమైతే వేసవిలో తలైవా అభిమానులకు థియేటర్లలో పండుగే అని చెప్పొచ్చు.
గోల్డ్ అక్రమ రవాణా నేపథ్యంలో సాగే కూలీలో పాపులర్ యాక్టర్ సత్యరాజ్, మహేంద్రన్, అక్కినేని నాగార్జున, మంజుమ్మెల్ బాయ్స్ ఫేం సౌబిన్ షాహిర్ (Soubin Shahir) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో రజినీకాంత్ స్మగ్లర్‌గా కనిపించబోతున్నట్టు సమాచారం. ఈ మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ తెరకెక్కిస్తు్న్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
#Coolie planning for May-1 (Long Holiday weekend release) is everything goes as planned 🌟🔥
The most awaited Pan Indian biggie from Kollywood 💣#Rajinikanth | #LokeshKanagaraj | #Anirudh pic.twitter.com/nun5f7dkdo
— AmuthaBharathi (@CinemaWithAB) November 13, 2024
Ram Gopal Varma | రామ్ గోపాల్ వర్మకు నోటీసులు అందజేసిన పోలీసులు
Bhairavam | గజపతిగా మంచు మనోజ్.. ట్రెండింగ్‌లో భైరవం మాసీ లుక్
Matka | వరుణ్ తేజ్ మాస్ ఫీస్ట్.. మట్కా రన్ టైం ఎంతో తెలుసా..?