Devendra Fadnavis | ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు యావత్మాల్కు వెళ్లగా అధికారులు తన బ్యాగ్ తనిఖీ చేశారంటూ శివసేన (యూటీబీ) చీఫ్, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ, అమిత్‌షా బ్యాగులను కూడా చెక్ చేశారా..? అంటూ ప్రశ్నించారు. ఠాక్రే వ్యాఖ్యలపై బీజేపీ తాజాగా స్పందించింది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) బ్యాగ్‌ను కూడా చెక్ చేసినట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు ఠాక్రేకు కౌంటర్ ఇస్తూ వీడియోను విడుదల చేసింది.
నవంబర్ 5న కొల్హాపూర్, నవంబర్ 7న యవత్మాల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఫడ్నవీస్ బ్యాగ్‌లను అధికారులు తనిఖీ చేసినట్లు తెలిపింది. అయితే, ఆ తనిఖీల గురించి డిప్యూటీ సీఎం ఎలాంటి విమర్శలూ చేయలేదంటూ పేర్కొంది. రాజ్యాంగ ప్రతిని వెంట తీసుకెళ్లి ప్రదర్శిండం కాదు.. రాజ్యాంగపరమైన నిబంధనలనూ అనుసరించాలంటూ ఠాక్రేపై విరుచుకుపడింది. కొందరికి ప్రతి దాన్నీ సమస్యగా చిత్రీకరించడం అలవాటూ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
जाऊ द्या, काही नेत्यांना तमाशा करण्याची सवयच असते!
हा व्हीडिओ पहा, 7 नोव्हेंबरला यवतमाळ जिल्ह्यात आमचे नेते मा. देवेंद्रजी फडणवीस यांच्या बॅगची तपासणी झाली. पण, त्यांनी ना कोणता व्हीडिओ काढला, ना कोणती आगपाखड केली. तत्पूर्वी, 5 नोव्हेंबर रोजी कोल्हापूर विमानतळावर सुद्धा मा.… pic.twitter.com/ebkuigJE2E— भाजपा महाराष्ट्र (@BJP4Maharashtra) November 13, 2024
కాగా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) బ్యాగులను ఎలక్షన్ కమిషన్ (ఈసీ) అధికారులు తనిఖీ చేశారు. సోమవారం వానీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. యవత్మాల్లోని హెలిప్యాడ్‌లో దిగిన హెలికాప్టర్‌లోని ఉద్ధవ్ బ్యాగులను ఈసీ అధికారులు చెక్ చేశారు. ఈ సందర్భంగా వారిపై ఆయన మండిపడ్డారు. తన యూరిన్ పాట్, హెలికాప్టర్‌లోని ఫ్యూయల్ ట్యాంక్‌ను కూడా చెక్ చేయాలంటూ ఎగతాళి చేశారు. దీనిని వీడియో తీస్తున్నట్లు ఈసీ అధికారులతో అన్నారు. ‘నా బ్యాగులు చూసే ముందు మీరు ఏ రాజకీయ నేతల బ్యాగులను తనిఖీ చేశారు? ఏక్నాథ్ షిండే, ఫడ్నవీస్, అజిత్ పవార్, మోదీ, అమిత్ షా బ్యాగ్‌లను మీరు చెక్ చేశారా? మోడీ బ్యాగ్‌లను తనిఖీ చేసిన వీడియోను నాకు చూపించండి. నేను దీనిని వీడియో తీస్తున్నా’ అని అన్నారు. మరోవైపై ఠాక్రే విమర్శలపై కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాజీవ్ కుమార్ స్పందించిన విషయం తెలిసిందే. దేశంలోని అగ్ర రాజకీయ నేతలకు సంబంధించిన హెలికాప్టర్లలో కూడా సోదాలు చేస్తామని తెలిపారు. నిబంధనల ప్రకారమే ఠాక్రే బ్యాగ్‌ను పరిశీలించామన్నారు.
उद्धव ठाकरे आज वणीमध्ये संजय देरकर यांच्या प्रचारासाठी पोहोचल्यानंतर हेलिकॉप्टरमध्ये उतरताच निवडणूक अधिकाऱ्यांनी बॅगेची तपासणी केली. #MaharashtraAssemblyElections2024 pic.twitter.com/wZPpGvGXju
— Girish Kamble (@GirishKamble22) November 11, 2024
Also Read..
Jharkhand Elections | జార్ఖండ్ అసెంబ్లీ, వయనాడ్ లోక్‌సభ స్థానానికి కొనసాగుతున్న పోలింగ్
Air Pollution | ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. జీరోకు పడిపోయిన విజిబిలిటీ
Red Sea | ఎర్రసముద్రంలో అమెరికా యుద్ధ నౌకలపై హౌతీల దాడులు