Red Sea | ఎర్ర సముద్రం (Red Sea)లో హౌతీ రెబల్స్ (Houthi rebels) మరోసారి దాడులకు తెగబడ్డారు. అగ్రరాజ్యం అమెరికాకు చెందిన రెండు యుద్ధ నౌకల (US warships)పై తాజాగా దాడి చేశారు. ఈ విషయాన్ని పెంటగాన్ (Pentagon) తాజాగా వెల్లడించింది.
బాబ్ అల్ మందాబ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న తమ యుద్ధ నౌకలపై యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు దాడులు చేసినట్లు తెలిపింది. డ్రోన్లు, క్షిపణుల (Drones And Missiles)తో ఈ దాడులకు పాల్పడినట్లు పేర్కొంది. ఈ దాడులను నౌకలోని తమ సిబ్బంది తిప్పి కొట్టినట్లు తెలిపింది. ‘కనీసం ఎనిమిది వన్-వే అటాక్ అన్‌క్రూడ్ ఏరియల్ సిస్టమ్స్, ఐదు యాంటీ – షిప్ బాలిస్టిక్ క్షిపణులు, మూడు యాంటీ – షిప్ క్రూయిజ్ క్షిపణులతో దాడి చేశారు. అప్రమత్తమైన యుద్ధ నౌకల్లోని సిబ్బంది హౌతీల దాడులను విజయవంతంగా తిప్పికొట్టారు. ఈ దాడిల్లో నౌకలకు ఎలాంటి నష్టం వాటిల్లలేదు. అందులోని సిబ్బందికి కూడా ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు’ అని పెంటగాన్ (Pentagon) ప్రతినిధి మేజర్ జనరల్ పాట్ రైడర్ తెలిపారు. కాగా, 2023 నవంబర్‌లో ఎర్ర సముద్రం, ఏడెన్ గల్ఫ్‌లో వాణిజ్య నౌకలే లక్ష్యంగా హౌతీలు దాడులు ప్రారంభించిన విషయం తెలిసిందే.
Also Read..
Air Pollution | ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. జీరోకు పడిపోయిన విజిబిలిటీ
Thalapathy 69 | విజయ్ దళపతి 69లో కన్నడ స్టార్ హీరో.. రోల్ ఏంటో మరి..?