Laapataa Ladies | బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్ (Aamir Khan) ప్రొడక్షన్లో, ఆయన మాజీ భార్య కిరణ్ రావ్ (Kiran Rao) దర్శకత్వంలో వచ్చిన ‘లాపతా లేడీస్’ (Laapataa Ladies) చిత్రం అరుదైన ఘనత సాధించిన విషయం తెలిసిందే. 2025 ఆస్కార్(Oscars 2025)కు మనదేశం నుంచి ‘లాపతా లేడీస్’ సినిమా అధికారికంగా ఎంపికైంది. ఉత్తమ విదేశీ చిత్ర కేటగిరిలో భారత్ నుంచి ఎంట్రీ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఆమీర్ ఖాన్, కిరణ్ రావ్ ఇతర చిత్రబృందం విదేశాల్లో ఆస్కార్ క్యాంపెయిన్ (Academy Award campaign) కూడా ప్రారంభించింది. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు చేరువ చేసేందుకు చిత్ర యూనిట్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ చిత్ర టైటిల్‌ను మార్చారు. ‘లాస్ట్ లేడీస్’ (Lost Ladies) అనే పేరుతో క్యాంపెయిన్ చేస్తున్నారు. ఈ మేరకు చిత్ర బృందం కొత్త పోస్టర్‌ను అధికారికంగా విడుదల చేసింది.
బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్ (Aamir Khan) ప్రోడక్షన్లో వచ్చిన చిత్రం ‘లాపతా లేడీస్’ (Laapataa Ladies). ఆయన మాజీ భార్య కిరణ్ రావ్ (Kiran Rao) ఈ సినిమాకు దర్శకత్వం వహించింది. జమ్తారా (Jamtara) వెబ్‌సిరీస్ ఫేమ్ స్పర్శ్ శ్రీవాస్తవ్ (Sparsh Shrivastav) ఈ మూవీలో హీరోగా నటించగా.. భోజ్‌పురి నటుడు రవి కిషన్ కీలక పాత్రలో మెరిశాడు. ఈ సినిమా మార్చి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రం ఇప్పటికే పలు ప్రతిష్ఠాత్మక అవార్డులను అందుకున్నది. సుప్రీం కోర్టు ఆవిర్భవించి 75 ఏళ్లు అయిన సందర్భంగా.. కోర్టు అడ్మినిస్ట్రేట్ వేడుకల్లోనూ ఈ చిత్రం ప్రదర్శితమైంది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే..
2001లో సాగే కథ ఇది. పల్లెప్రాంతానికి చెందిన ఇద్దరు పెళ్లికూతుళ్లు రైలు ప్రయాణంలో అనుకోకుండా తారుమారు అవుతారు. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అనేదే ఈ చిత్ర కథ. భారతీయ సమాజంలో కట్టుబాట్ల పేరుతో మహిళల స్వేచ్ఛను హరిస్తున్న తీరుని, వారి ఆకాంక్షలను అణచివేస్తున్న ధోరణిని సందేశాత్మకంగా ఈ చిత్రంలో ఆవిష్కరించారు. ఓ వైపు నవ్విస్తూనే మరోవైపు సీరియస్ అంశాలను చర్చకు తీసుకొచ్చిందీ చిత్రం. పెళ్లి చేసుకొని అత్తారింట్లో సేవలు చేయడానికి మాత్రమే మహిళలు ఉన్నారని, వారికి ఎలాంటి వ్యక్తిగత ఇష్టాలు ఉండవనే ఆలోచనల్లో మార్పు రావాలని దర్శకురాలు కిరణ్‌రావ్ ఈ సినిమా ద్వారా తెలియజెప్పారు. ముఖ్యంగా గ్రామీణ మహిళల్లో చైతన్యం తీసుకొచ్చేలా ఈ సినిమాను రూపొందించారు. గతేడాది ప్రతిష్టాత్మ టోరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. అలాగే సుప్రీంకోర్ట్ 75ఏళ్ల వేడుకలో కూడా ప్రదర్శించారు. ఆస్ట్రేలియా మెల్బోర్న్లో జరిగిన ‘ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్’ అవార్డుల్లోనూ క్రిటిక్స్ విభాగంలో ‘లాపతా లేడీస్’ ఉత్తమ చిత్రంగా అవార్డు అందుకోవడం విశేషం. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.
Also Read..
Donald Trump: ఎలన్ మస్క్, వివేక్ రామస్వామికి .. కీలక బాధ్యతలు అప్పగించిన డోనాల్డ్ ట్రంప్
తోటి మనిషి బాగు కోరుకోవడమే కాళోజీకి అందించే ఘన నివాళి: కేసీఆర్
KTR | జాగో తెలంగాణ.. 11 నెలల కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ ఆగ్రహం