Air Pollution | దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం (Air Pollution) కొనసాగుతోంది. గత 15 రోజులుగా గాలి నాణ్యత సూచీ అధ్వానంగా ఉంది. బుధవారం ఉదయం కూడా చాలా పేలవమైన స్థాయిలో నమోదైంది. బుధవారం ఉదయం 8 గంటల సమయంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (Air Quality Index) 361గా నమోదైంది. పలు ప్రాంతాల్లో 400 మార్క్‌ను కూడా దాటింది. అదే సమయంలో రాజధాని ప్రాంతాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది (Thick smog). దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
VIDEO | Dense #smog cover in parts of Delhi. Visuals from Akshardham area.#DelhiWeather #DelhiPollution
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/nTRkp0W95m
— Press Trust of India (@PTI_News) November 13, 2024
కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (Central Pollution Control Board) ప్రకారం.. ఆయా నగర్లో అత్యధికంగా గాలి నాణ్యత సూచీ 417గా నమోదైంది. ఇది తీవ్రమైన కేటగిరీ కిందకు వస్తుంది. ఇక ఆనంద్ విహార్ ప్రాంతంలో ఏక్యూఐ లెవల్స్ 396గా, జహంగీర్‌పురిలో 389, ఐటీవోలో 378, ఎయిర్‌ఫోర్ట్ ప్రాంతంలో 368గా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నమోదైంది.
#WATCH | Delhi continues to be covered in a blanket of smog in the mornings as the air quality in the city remains in ‘Very Poor’ category as per Central Pollution Control Board (CPCB).
(Visuals from Azadpur Mandi) pic.twitter.com/h9CR1CtRZO
— ANI (@ANI) November 13, 2024
గాలి నాణ్యతకు తోడు నగరాన్ని దట్టమైన పొగమంచు చుట్టుముట్టింది. దీంతో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో దృశ్యమానత దారుణంగా పడిపోయింది. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో విజిబిలిటీ దాదాపు జీరోగా నమోదైంది. ఢిల్లీతోపాటు నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్, ఫరీదాబాద్ పరిసన ప్రాంతాలను కూడా దట్టమైన పొగ ఆవహించింది. పొగమంచు కారణంగా రైలు, విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. పొగమంచు కారణంగా రోడ్డుపై ముందు వెళ్తున్న వాహనాలు కనిపించని పరిస్థితి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
#WATCH | A layer of smog engulfs the area around India Gate as the Air Quality Index (AQI) across Delhi continues to be in the ‘Very Poor’ category in several areas as per the Central Pollution Control Board (CPCB). pic.twitter.com/fysBenqUqL
— ANI (@ANI) November 13, 2024
Also Read..
Donald Trump: ఎలన్ మస్క్, వివేక్ రామస్వామికి .. కీలక బాధ్యతలు అప్పగించిన డోనాల్డ్ ట్రంప్
Car Attack: చైనాలో కారు బీభత్సం.. 35 మంది మృతి, 45 మందికి గాయాలు