సంగారెడ్డి : తెలంగాణలో 2030 నాటికి 2 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ పెట్టుబడులే లక్ష్యంగా పని చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka )అన్నారు. ఖనిజ ఉత్పత్తుల కోసం ఐఐటీ హైదరాబాద్‌తో (IIT Hyderabad)సింగరేణి ఒప్పందం చేసుకోవడం సంతోషకరమైన విషయం అన్నారు. దేశ ప్రగతిలో ఐఐటీలది కీలక పాత్ర అని పేర్కొన్నారు. జవహర్ లాల్ నెహ్రూ ఆధునిక దేవాలయాలు అయిన ఐఐటీలకి అంకురార్పణ చేశారని చెప్పారు.
ఐఐటీ హైదరాబాద్ విద్యాసంస్థ కాదు ఆవిష్కరణలకు కేంద్ర బిందువని ప్రశంసించారు. ఫ్లోటింగ్ సోలార్ పై తెలంగాణలో పెట్టుబడులు పెడుతామని స్పష్టం చేశారు. గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా తెలంగాణను మారుస్తామని భట్టి విక్రమార్క తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Cold Weather | రాష్ట్రంలో కనిష్ఠానికి పడిపోయిన ఉష్ణోగ్రతలు.. అత్యల్పంగా సిర్పూర్లో 6.5 డిగ్రీలు
KTR | ఆడబిడ్డల చదువుకై అక్షర సమరం చేసిన చదువుల తల్లి సావిత్రీబాయి: కేటీఆర్
RRR | పరిహారంపై పీటముడి.. ఆర్ఆర్ఆర్ భూసేకరణపై వీడని సందిగ్ధత!