న్యూఢిల్లీ : అధికారం ఉంది కదా అని అడ్డగోలుగా తన సొంత పనుల కోసం సిబ్బందిని వాడుకోవడానికి ప్రయత్నించిన బీఎస్ఎన్ఎల్ ఉన్నతాధికారి ఒకరు అడ్డంగా బుక్కయ్యాడు. బీఎస్ఎన్ఎల్ డైరెక్టర్ వివేక్ బంజాల్ 25న యూపీలోని ప్రయాగ్‌రాజ్‌కు వ్యక్తిగత పర్యటన పెట్టుకున్నారు.
ఇంకేముంది తన టూర్ కోసం ఏకంగా ఆ శాఖలోని 50 మంది అధికారులు, సిబ్బందికి వివిధ పనులు పురమాయిస్తూ ఈ నెల 19న ఏకంగా ఆఫీస్ ఆర్డరే వేశాడు. ఇది నిజంగా షాక్ కలిగించిందని, ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మండిపడ్డారు. దీనిపై షోకాజ్ నోటీస్ పంపి ఏడు రోజుల్లో సమాధానం చెప్పాలని ఆదేశించారు.