హైదరాబాద్ ఫిబ్రవరి 25 (నమస్తేతెలంగాణ): తాము చేపట్టిన లిథియం మైనింగ్‌లో భాగస్వాములు కావాలని సింగరేణికి బ్రెజిల్ దేశానికి చెందిన సీబీఎల్ కంపెనీ ఆహ్వానం పలికింది. సీబీఎల్ బోర్డు డైరెక్టర్ డానియల్ లెమే, సీఈవో వినీసియస్ అల్వారెంగా నేతృత్వంలోని ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం సింగరేణి సీఎండీ జ్యోతిప్రకాశ్ బుద్ధను హైదరాబాద్‌లోని సంస్థ కార్యాయంలో బుధవారం కలిసింది. ఈ సందర్భంగా వారు కంపెనీ వివరాలను తెలియజేశారు.
తాము చేపట్టిన లిథియం మైనింగ్‌లో పాలుపంచుకోవడం ద్వారా సింగరేణికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని వివరించారు. ప్రపంచవాప్తంగా లిథియం ఖనిజానికి ఉన్న ప్రాధాన్యత, వ్యాపార కోణంలో లాభాలను గురించి వెల్లడించారు. కాగా, సింగరేణి సంబంధించిన ప్రత్యేకతలు ఇతర వివరాలను డైరెక్టర్ వెంకటేశ్వరు (పీ అండ్ పీ), డైరెక్టర్ గౌతమ్పొట్రు (పీ అండ్ ఎఫ్) వివరించారు. సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని వారు సీబీఎల్ ప్రతినిధులకు తెలియజెప్పారు.