Motkupalli Narasimhulu | యాదాద్రి భువనగిరి : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే నిరుద్యోగులకు రూ. 5000 నిరుద్యోగ భృతిని ప్రకటించాలని మాజీమంత్రి మోతుపల్లి నర్సింహులు డిమాండ్ చేశారు. మోత్కుపల్లి తన పుట్టినరోజు సందర్భంగా గురువారం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
దర్శనానంతరం మోత్కుపల్లి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వాలు నిరుద్యోగులు తల్లిదండ్రుల మాదిరి వ్యవహరించాలని కోరారు. ఆయా యూనివర్సిటీల్లో పోలీసులు ఉక్కుపాదం మోపి నిరుద్యోగులను దారుణంగా కొడుతున్నారు. నిరుద్యోగుల నిరసనలను పోలీసులు అణిచివేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదని మోత్కుపల్లి పేర్కొన్నారు.
కష్టాల్లో ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపునకు కృషి చేశానని మాజీ మంత్రి తెలిపారు. 80 లక్షల మంది ఉన్న దళితులకు అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఒక్క టికెట్ ఇవ్వలేదు అన్నారు. నీతి కలిగిన దళితుడినైన తనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. వేల కోట్లు ఉన్నోడికి టికెట్లు ఇచ్చారని గుర్తు చేశారు. కనీసం బీసీలను పట్టించుకున్న పాపాన కాంగ్రెస్ పార్టీ లేదన్నారు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఫోటోతో పాటు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటో కూడా అధికార కార్యాలయంలో ఉంచారన్నారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఉపముఖ్యమంత్రి భట్టి ఫోటోను విస్మరిస్తున్నారని, ఇది చాలా బాధాకరం అని మోత్కుపల్లి నర్సింహులు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Balkampeta Yellamma | రేవంత్ రెడ్డికి శాపనార్థాలు పెట్టిన జోగినిలు.. వీడియో
Shankar | కమల్ హాసన్ ఇండియన్ 2 ఎండింగ్లో సర్ప్రైజ్.. శంకర్ ఏం ప్లాన్ చేశాడో మరి.. ?
Venkatesh – Anil Ravipudi | తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంలో ‘వెంకీ’ మూవీ కోసం కోసం భారీ సెట్.!