Shankar | కమల్‌హాసన్ (Kamal Haasan) టైటిల్ రోల్లో నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ఇండియన్ 2 (Indian 2). స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) కాంపౌండ్ నుంచి వస్తోన్న ఈ చిత్రం జులై 12న తమిళం, తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా విడుదలవుతుంది. తెలుగులో భారతీయుడు 2గా వస్తోంది. కాగా ఇప్పటికే భాషల వారీగా ప్రమోషనల్ ఈవెంట్స్‌తో బిజీగా ఉంది శంకర్ టీం.
తాజాగా శంకర్ మూవీ లవర్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేశాడన్న వార్త నెట్టింట వైరల్ అవుతోంది.ఇంతకీఅదేంటనుకుంటున్నారా..? ఇండియన్ ప్రాంఛైజీలో ఇండియన్ 3 కూడా ఉండబోతుందని తెలిసిందే. షూటింగ్ కూడా పూర్తయింది. మూడో పార్టు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. తాజా సమాచారం ప్రకారం శంకర్ ఇండియన్ 3 ట్రైలర్‌ను రెడీ చేశాడట.
కేరళలో ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో శంకర్ మాట్లాడుతూ.. ఇండియన్ 2 ఎండింగ్లో ఇండియన్ 3 ట్రైలర్‌ను చూపించబోతున్నట్టు చెప్పాడు. మొత్తానికి శంకర్ మూవీ లవర్స్‌కు ఊపిరాడకుండా చేయాలని గట్టిగానే ఫిక్సయినట్టు ఈ వార్త చెప్పకనే చెబుతోంది. అవినీతి, లంచం బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఆల్‌టైమ్ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ భారతీయుడుకు సీక్వెల్‌గా తెరకెక్కుతోంది.
ఇండియన్ 2లో ఎస్జే సూర్య, బాబీ సింహా, సిద్దార్థ్, సముద్రఖని, లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం, మధుబాల, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్-రెడ్ జియాంట్ మూవీస్‌పై ఉదయనిధి స్టాలిన్-సుభాస్కరన్ తెరకెక్కిస్తున్నారు.
Shankar | మమ్మల్ని నమ్మండి… అంతకంటే ఎక్కువే శ్రమించాం.. డైరెక్టర్ శంకర్ కామెంట్స్ వైరల్
Indian 2 | ఇండియన్ 3 ట్రైలర్ అప్పుడే.. గేమ్ ఛేంజర్ రిలీజ్‌పై ఎస్జే సూర్య ఏమన్నాడంటే..?