Indian 2 | తమిళం, తెలుగు, పాన్ ఇండియాతోపాటు వరల్డ్ వైడ్‌గా ఉన్న మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఇండియన్ 2 (Indian 2). శంకర్ (Shankar) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కమల్‌హాసన్ (Kamal Haasan) టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. మేకర్స్ ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ మూవీ జులై 12న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ అండ్ టీం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. తాజాగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఇండియన్ 2 తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎస్జే సూర్య చేసిన కామెంట్స్ అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తున్నాయి.
ఈవెంట్లో ఎస్జే సూర్య మాట్లాడుతూ.. జులై 12న ఇండియన్ 2 చూడండి. ఇండియన్ 2 సక్సెస్ ఈవెంట్లో ఇండియన్ 3 ట్రైలర్ విడుదల చేస్తాం.. అంతేకాదు విడుదల తేదీ కూడా ప్రకటిస్తాం. కానీ అంతకుముందే గేమ్ ఛేంజర్ విడుదలవుతుంది. ఇండియన్ 2లో నేను కొద్దిసేపే కనిపిస్తా.. కానీ సినిమా చాలా బాగా వచ్చింది. కానీ ఇండియన్ 3 గేమ్ ఛేంజర్‌లో కీలక సాగే పాత్రల్లో నటించా. మీ అందరినీ నేను థ్రిల్ చేయడం గ్యారంటీ.. అని చెప్పుకొచ్చాడు.
దుబాయ్, సింగపూర్, మలేషియా, లండన్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ 2ను ప్రమోట్ చేస్తున్నారు మేకర్స్. అవినీతి, లంచం లాంటి అంశాల నేపథ్యంలో భారతీయుడుకు సీక్వెల్ వస్తోన్న ఇండియన్ 2లో ఎస్జే సూర్య, బాబీ సింహా, సిద్దార్థ్, సముద్రఖని, లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం, మధుబాల, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జియాంట్ మూవీస్‌పై ఉదయనిధి స్టాలిన్-సుభాస్కరన్ తెరకెక్కిస్తున్నారు.