Shankar | తమిళం, తెలుగుతోపాటు గ్లోబల్ స్థాయిలో సూపర్ క్రేజ్ ఉన్న అతికొద్ది మంది భారతీయ దర్శకుల్లో శంకర్ (Shankar) ఒకరు. ఈ స్టార్ డైరెక్టర్ కాంపౌండ్ నుంచి వరుసగా మూడు పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయని తెలిసిందే. వీటిలో ఒకటి ప్రాంచైజీ ప్రాజెక్ట్ ఇండియన్ 2 (Indian 2). కమల్‌హాసన్ (Kamal Haasan) టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. జులై 12న భారతీయుడు 2 వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ అండ్ శంకర్ టీం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ప్రమోషన్స్‌లో భాగంగా శంకర్ రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానమిచ్చి సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాడు.
ప్రమోషనల్ ఇంటర్వ్యూలో శంకర్ మాట్లాడుతూ.. ఒకేసారి రెండు సినిమాలు చేసినా.. నేను సెఫరేటుగా చేస్తే ఎలాంటి కృషి పెడతానో నాతోపాటు నా టీం అంతా అంతకంటే ఎక్కువే కష్టపడ్డారు. ఒకేసారి రెండు సినిమాలు చేశారు.. క్వాలిటీ తగ్గిందని మాట రావొద్దని ఎక్కువగా కష్టపడ్డాం. భారతీయుడు 2 మధ్యలో కరోనా వచ్చింది. నేనెప్పుడూ షూటింగ్ మొదలుపెట్టినా సిద్దంగా ఉండాలని కరోనా టైంలోనే స్క్రీన్ రైటింగ్, షాట్ డివిజన్, ప్రాపర్టీస్, ఆర్టిస్టుల జాబితా, కాస్ట్యూమ్స్ అన్నీ అయిపోయాయి.
లొకేషన్స్ కూడా అన్నీ చూసేశాం. షూటింగ్ స్పాట్‌కెళ్లి షూట్ చేయాలి అంతే. అలా పూర్తిగా సిద్దంగా ఉంది కాబట్టి నాకు గేమ్ ఛేంజర్ షూట్ కూడా సులభంగా అయింది. ఇండియన్ 2, గేమ్ ఛేంజర్‌తోపాటు ఇండియన్ 3 సినిమాలన్నీ అనుకున్న దాని కంటే బాగా వచ్చాయి. ఆ విషయంలో మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మమ్మల్ని నమ్మండని కోరాడు శంకర్. గేమ్ ఛేంజర్‌లో రాంచరణ్ పార్ట్ షూట్ పూర్తయింది. ఇంకో 10-15 రోజులు షూటింగ్ ఉంది. అది పూర్తయ్యాక ఎడిటింగ్ లాక్ అయిన తర్వాత ఎప్పుడు విడుదలవుతుందనేది ప్రకటిస్తామన్నాడు.
అవినీతి, లంచం లాంటి అంశాల నేపథ్యంలో భారతీయుడుకు సీక్వెల్ వస్తోన్న ఇండియన్ 2లో ఎస్జే సూర్య, బాబీ సింహా, సిద్దార్థ్, సముద్రఖని, లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం, మధుబాల, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జియాంట్ మూవీస్‌పై ఉదయనిధి స్టాలిన్-సుభాస్కరన్ తెరకెక్కిస్తున్నారు.
Bad Newz | నెట్టింట సెగలు రేపుతున్న తృప్తి డిమ్రి.. విక్కీ కౌశల్ Bad Newz సాంగ్ ప్రోమో వైరల్
Raj Tarun | ఆ విషయంలో లావణ్య ఫెయిల్.. రాజ్ తరుణ్‌కు క్లీన్చిట్..?
Spirit | సందీప్ రెడ్డి వంగా ప్లాన్ అదిరింది.. ప్రభాస్ స్పిరిట్‌లో విలన్ ఎవరో తెలుసా..?
Indian 2 | ఇండియన్ 3 ట్రైలర్ అప్పుడే.. గేమ్ ఛేంజర్ రిలీజ్‌పై ఎస్జే సూర్య ఏమన్నాడంటే..?