Raj Tarun | టాలీవుడ్ యంగ్ హీరో రాజ్‌తరుణ్ (Raj Tarun) పై అతని ప్రేయసి లావణ్య (lavanya) పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయడం కొన్ని రోజులుగా హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మాల్వీ మల్హోత్రాతో ఎఫైర్ కారణంగా వదిలేసి వెళ్లిపోయాడని నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
అయితే లావణ్య పిర్యాదులో పేర్కొన్న విషయాలన్నీ అబద్దాలనీ.. ఆమె డ్రగ్స్‌కు బానిసవడంతో చాలా కాలం క్రితమే లావణ్యతో బ్రేకప్ చేసుకున్నానని రాజ్‌తరుణ్ ఇప్పటికే మీడియాతో వెల్లడించారు. అయితే తాజా టాక్ ప్రకారం పోలీసులు విచారణలో భాగంగా లావణ్యను పిర్యాదులో పేర్కొన్న విషయాలపై ఆధారాలు ఏవని అడుగగా.. వాటిని చూపించడంలో లావణ్య ఫెయిల్ అయిందట. ఈ నేపథ్యంలో తాజా కేసులో రాజ్‌తరుణ్‌కు క్లీన్ చిట్ వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
పదకొండేళ్లుగా రాజ్‌తరుణ్‌తో రిలేషన్షిప్లో ఉన్నానని.. గుడిలో కూడా పెళ్లి చేసుకున్నాం. కానీ రాజ్ తరుణ్ తన సినిమాలో నటిస్తోన్న హీరోయిన్‌తో అఫైర్ పెట్టుకొని నన్ను వదిలేశాడని లావణ్య పిర్యాదులో పేర్కొన్న విషయం తెలిసిందే. రాజ్ తరుణ్ నా ప్రపంచం..రాజ్ తరుణ్ నాకు కావాలి. నాకు న్యాయం చేయాలి. గతంలో తనను డ్రగ్స్ కేసులో కావాలనే ఇరికించారని ఆరోపించిన లావణ్య ఈ కేసులో అరెస్టై 45 రోజులు జైల్లో ఉన్నానని.. ఆ సమయంలో రాజ్ తరుణ్ తనకెలాంటి సాయం చేయలేదని కూడా పేర్కొంది.
మేము పెళ్లి చేసుకున్న ఫొటోలు నా ఫోన్లో ఉండేవి. వాటిని రాజ్ తరుణ్ డిలిట్ చేశాడు. నేను రాజ్ తరుణ్ లైఫ్‌లోకి హీరో అయ్యాకా రాలేదు.అతడు ఉయ్యాలా జంపాలా సినిమా తీసే టైంలోనే పక్క పక్క ఇళ్లల్లో ఉండేవాళ్లం. మా పెళ్లి విషయం సమయం వచ్చినప్పుడు నేనే బహిరంగంగా ప్రకటిస్తానని చెప్పడంతో అతడిని నమ్మాను. రాజ్ తరుణ్ లేకుండా నేను బతకలేను. నేను ముసలిదాన్ని అయినా కూడా అతనే నా మనసులో ఉంటాడని అంటోంది లావణ్య. మరి ఈ కేసుపై పోలీసులు అధికారికంగా ఏవైనా వివరాలు వెల్లడిస్తారా.. అనేది చూడాల్సి ఉంది.
Spirit | సందీప్ రెడ్డి వంగా ప్లాన్ అదిరింది.. ప్రభాస్ స్పిరిట్‌లో విలన్ ఎవరో తెలుసా..?
Indian 2 | ఇండియన్ 3 ట్రైలర్ అప్పుడే.. గేమ్ ఛేంజర్ రిలీజ్‌పై ఎస్జే సూర్య ఏమన్నాడంటే..?