Spirit | అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ సినిమాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). గతేడాది యానిమల్ సినిమాతో మరోసారి రికార్డులు కొల్లగొట్టాడు. ఈ స్టార్ డైరెక్టర్ కాంపౌండ్ నుంచి రాబోతున్న మరో క్రేజీయెస్ట్ సినిమా స్పిరిట్ (Spirit). ప్రభాస్ (Prabhas) హీరోగా రాబోతున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ 2024 చివరలో మొదలు కానుందని ఇప్పటికే హింట్ ఇచ్చేశాడు సందీప్ రెడ్డి వంగా.
కాగా సినిమా అప్డేట్ కోసం ఎదురుచూస్తున్న మూవీ లవర్స్ కోసం ఆసక్తికర వార్త తెరపైకి వచ్చింది. చాలా రోజుల తర్వాత ఈ మూవీలో విలన్‌గా ఎవరు కనిపించబోతున్నారనే దానికి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ అభిమానులు, మూవీ లవర్స్‌ను ఖుషీ చేస్తోంది. ఈ చిత్రంలో పాపులర్ సౌత్ కొరియన్ యాక్టర్ మడాంగ్సియోక్ (MaDongSeok) విలన్‌గా కనిపించబోతున్నాడట. ఈ పాన్ ఆసియన్ మూవీని భారతీయ భాషలతోపాటు చైనీస్, కొరియన్ భాషలో విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారని తెలిసిందే. మొత్తానికి సందీప్ రెడ్డి వంగా ఈ సారి ఇంటర్నేషనల్ మార్కెట్‌ను కూడా షేక్ చేయాలని గట్టిగానే ఫిక్సయినట్టు తాజా అప్డేట్ చెప్పకనే చెబుతోంది.
స్పిరిట్‌లో ప్రభాస్ కెరీర్లో తొలిసారి ఖాకీ డ్రెస్ వేసుకోబోతున్నాడని నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా ఇప్పటికే వెల్లడించాడని తెలిసిందే . సందీప్ రెడ్డి వంగా ఇప్పటివరకు డైరెక్ట్ చేసిన సినిమాల్లో హీరోయిజాన్ని చూపించినట్టుగానే స్పిరిట్‌లో ప్రభాస్ పాత్ర ఉండబోతుందన్నాడు. సందీప్‌రెడ్డి వంగాతో కలిసి టి సిరీస్ అధినేత భూషణ్‌కుమార్ స్పిరిట్ సినిమాను నిర్మించనున్నారు.
Excited! 💯
According to recent reports, South Korean actor #MaDongSeok has been offered the role of a villain in #Prabhas’ #Spirit. This would mark his debut in the Telugu film industry as well as Indian film industry. 💯#News pic.twitter.com/mGJf7pkurP
— Filmfare (@filmfare) July 8, 2024
Just imagine
Ruthlesscop vS Ruthless Don
#Prabhas vs #MaDongSeokEdokala set karo anna @imvangasandeep #Spirit 🔥🙌pic.twitter.com/sk14AHtz7O
— Prabhas VijayRj👑 (@Prabhasvijayrj) July 7, 2024
Raj Tarun | ఆ విషయంలో లావణ్య ఫెయిల్.. రాజ్ తరుణ్‌కు క్లీన్చిట్..?
Indian 2 | ఇండియన్ 3 ట్రైలర్ అప్పుడే.. గేమ్ ఛేంజర్ రిలీజ్‌పై ఎస్జే సూర్య ఏమన్నాడంటే..?