Bad Newz | విక్కీ కౌశల్, యానిమల్ ఫేం తృప్తి డిమ్రి (Tripti Dimri) కాంబోలో వస్తున్న చిత్రం Bad Newz. ఆనంద్ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో అమ్మి విర్క్ మరో లీడ్ రోల్లో నటిస్తున్నాడు. నేహా ధూపియా కీలక పాత్రలో నటిస్తోంది. ఈ మూవీ జులై 19న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానున్న నేపథ్యంలో విక్కీ కౌశల్ టీం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఇందులో భాగంగా విక్కీ కౌశల్ రొమాంటిక్ ట్రాక్ జానమ్ సాంగ్ స్టిల్‌తోపాటు ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది.
తృప్తి డిమ్రి హాట్ హాట్ లుక్‌లో కనిపిస్తూ నెటిజన్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ పాటలను జులై 9న విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి లాంచ్ చేసిన Tauba Tauba సాంగ్ నెట్టింటిని షేక్ చేస్తోంది. పాపులర్ సింగర్, ర్యాపర్ Karan Aujla, విక్కీ కౌశల్ కాంబోలో తొలిసారి వస్తున్న ఈ పార్టీ యాంథెమ్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మ్యూజిక్ అండ్ మూవీ లవర్స్.
ఈ మూవీని ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. Bad Newz పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియో (పోస్ట్ థ్రియాట్రికల్) స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే లాంచ్ చేసిన పోస్టర్లు, ప్రమోషన్స్ తో సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ అవుతోంది.
“Sexiest Song of the year” is coming..#Jaanam – second song from #BadNews will be out tomorrow.. #VickyKaushal and #TriptiiDimri chemistry.. 🔥 pic.twitter.com/73kc8Ma0P2
— Ramesh Bala (@rameshlaus) July 8, 2024
Raj Tarun | ఆ విషయంలో లావణ్య ఫెయిల్.. రాజ్ తరుణ్‌కు క్లీన్చిట్..?
Spirit | సందీప్ రెడ్డి వంగా ప్లాన్ అదిరింది.. ప్రభాస్ స్పిరిట్‌లో విలన్ ఎవరో తెలుసా..?
Indian 2 | ఇండియన్ 3 ట్రైలర్ అప్పుడే.. గేమ్ ఛేంజర్ రిలీజ్‌పై ఎస్జే సూర్య ఏమన్నాడంటే..?