Farmer Flexi | నర్సాపూర్, జనవరి 4 : మందుబాబులు రోజు ఓ రైతు తోటలోకి వెళ్లి మద్యం సేవించి బీభత్సం సృష్టిస్తున్నారు. మందుబాబుల వికృత చేష్ఠలతో విసుగెత్తిపోయిన రైతుకు సరికొత్త ఆలోచన వచ్చింది. మందుబాబుల ఆగడాలను తట్టుకోలేక సదరు రైతు వినూత్న ఆలోచన చేశాడు.
మెదక్ జిల్లా నర్సాపూర్ మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామ శివారులో ఆనంద్ అనే రైతు మామిడి తోటను సాగు చేస్తున్నాడు. ప్రధాన రహదారికి ఈ మామిడి తోట పక్కనే ఉండడంతో మందుబాబులకు అడ్డాగా మారింది. నిత్యం మందుబాబులు తోటలోకి దూరి మద్యం సేవించి కాళీ సీసాలను పగలగొట్టి నానా బీభత్సం సృష్టిస్తున్నారు. రైతు ఆనంద్ మౌఖికంగా ఎన్ని సార్లు చెప్పినా మందుబాబులు వాళ్ళ పద్ధతిని మార్చుకోలేకపోయారు. ఇందుకు ఆ రైతుకు సహనం నశించి ఓ ప్లాన్ వేశాడు.
ఫ్లెక్సీ లపై మామిడి తోటలో మద్యం తాగితే 25 చెప్పు దెబ్బలు.. అలాగే 5000 జరిమాన అంటూ రాయించి తోటముందు కట్టించాడు. ఈ ఫ్లెక్సీలను చూసైనా మందుబాబుల ప్రవర్తనలో మార్పు వస్తుందో.. లేదో..? చూడాలి. నిత్యం మందుబాబులు తోటలోకి వచ్చి మద్యం తాగి సీసాలను పారవేయడమే కాకుండా వాటిని పగలగొట్టి నానా విధ్వంసం సృష్టిస్తున్నారని సదరు రైతు ఆనంద్ వాపోయాడు.

Watch: పాముతో వ్యక్తి సంభాషణ.. వీడియో వైరల్
Cigarettes | ‘సిగరెట్ల కోసం వియత్నాం ఫ్లైట్ ఎక్కండి’.. ఓ ఇన్వెస్ట్మెంట్ అడ్వయిజర్ పోస్టు వైరల్
Watch: స్వాతంత్ర్యం సిద్ధించిన 78 ఏళ్ల తర్వాత ఆ గ్రామానికి రోడ్డు.. తొలి బస్సుకు ఘన స్వాగతం