Constable Kanakam 2 | వర్ష బొల్లమ్మ (Varsha Bollamma) టైటిల్ రోల్లో నటించిన ప్రాజెక్ట్ కానిస్టేబుల్ కనకం (Constable Kanakam). క్రైం ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ ప్రాజెక్ట్‌కు ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించాడు. దీనికి కొనసాగింపుగా కానిస్టేబుల్ కనకం సీజన్ 2 కూడా వస్తుందని మేకర్స్ ప్రకటించారని తెలిసిందే. తాజాగా సీజన్ 2 పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం ఈటీవీ విన్లో 2026 జనవరి 8 నుంచి ప్రీమియర్ కానున్నట్టు ప్రకటించారు మేకర్స్.
రాజీవ్ కనకాల అంటే పాత్రలు ఎలా ఉంటాయో తెలిసిందే. ఇప్పటికే కానిస్టేబుల్ కనకం పార్ట్ 1లో తన పాత్రలో లీనమైపోయి కనిపించాడు రాజీవ్ కనకాల. రెండో పార్టులో కూడా కథ, కథనంలో రాజీవ్ కనకాల పాత్రకు చాలా ఎమోషనల్ డెప్త్ ఉంటుందట. ఇక సీజన్ 2లో శ్రీనివాస్ అవసరాల పాత్ర సాలిడ్ బిల్డప్‌తో మరింత కీలకంగా సాగనుందని ఇన్ సైడ్ టాక్. టాలెంటెడ్ యాక్టర్ల పర్ఫార్మెన్స్తో గ్రిప్పింగ్ డ్రామాతో సీజన్ 2 ప్రేక్షకులకు ఎంగేజ్ చేయడం పక్కా అని జోరుగా టాక్ నడుస్తోంది. మరి సీజన్ 2 ఎలాంటి రెస్పాన్స్ రాబట్టుకుంటుందో చూడాలి.
1990ల కాలంలో శ్రీకాకుళంలోని రేపల్లెలో అడవి గుట్ట, మహిళల మిస్సింగ్ నేపథ్యంలో ట్విస్టులతో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సాగే సీజన్ 2 ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. కనకం స్నేహితురాలు చంద్రిక మిస్సింగ్..? ఆ మిస్టరీని కనకం ఎలా చేధించిందనే నేపథ్యంలో సీజన్ 2 ఉండబోతుంది.
ఈ ప్రాజెక్టులో రాజీవ్ కనకాల, శ్రీనివాస్ అవసరాల, మేఘ లేఖ, రమణ భార్గవ్, ప్రేమ్ సాగర్ , జ్వాల కోటి, రాకేందు మౌళి ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరి రెండో పార్ట్ ఎలాంటి ట్విస్టులతో ఉండబోతుందనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
Watch: పాముతో వ్యక్తి సంభాషణ.. వీడియో వైరల్
Cigarettes | ‘సిగరెట్ల కోసం వియత్నాం ఫ్లైట్ ఎక్కండి’.. ఓ ఇన్వెస్ట్మెంట్ అడ్వయిజర్ పోస్టు వైరల్
Watch: స్వాతంత్ర్యం సిద్ధించిన 78 ఏళ్ల తర్వాత ఆ గ్రామానికి రోడ్డు.. తొలి బస్సుకు ఘన స్వాగతం