Dhurandhar | బాలీవడ్ బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్’ (Dhurandhar) సృష్టించిన సునామీ ఇంకా ఆగడం లేదు. బాలీవుడ్ చరిత్రలో మరే ఇతర హిందీ సినిమాకు సాధ్యం కాని రీతిలో ఈ చిత్రం సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. విడుదలైన ఐదో వారంలో కూడా మంచి కలెక్షన్లు సాధిస్తున్న ఈ సినిమా తాజాగా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 800 కోట్ల క్లబ్లో అడుగుపెట్టింది. దీంతో భారతీయ సినీ పరిశ్రమలో ఒక హిందీ సినిమా రూ. 800 కోట్ల మైలురాయిని అందుకున్న చిత్రంగా ధురంధర్ రికార్డులకెక్కింది.
అలాగే ప్రస్తుతం బాలీవుడ్ మార్కెట్లో ‘పుష్ప 2’ (హిందీ వెర్షన్) అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా మొదటి స్థానంలో ఉంది. ఇప్పుడు ‘ధురంధర్’ సాధిస్తున్న వసూళ్ల వేగాన్ని చూస్తుంటే అతి త్వరలోనే ‘పుష్ప 2’ లైఫ్ టైమ్ బిజినెస్ రికార్డును ధురంధర్ అధిగమించడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో హిందీ బెల్ట్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన నంబర్ వన్ చిత్రంగా అవతరించేందుకు ‘ధురంధర్’ కేవలం కొన్ని అడుగుల దూరంలోనే ఉంది.
800 NOT OUT – ‘DHURANDHAR’ INCHES CLOSER TO ‘PUSHPA 2’… #Dhurandhar makes a majestic entry into the ₹ 800 cr club on its fifth Saturday [Day 30], becoming the first *outright* #Hindi film to achieve this historic milestone.
The film now inches closer to the *lifetime… pic.twitter.com/WhT9S1zPYf
— taran adarsh (@taran_adarsh) January 4, 2026