‘థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ట్విస్టులు, ఎమోషన్స్‌తో కూడిన ప్యాకెజ్ పటాక ‘సరస్వతి’. ఇదొక క్రైమ్ థ్రిల్లర్. రెండుగంటల పాటు ఉత్కంఠతో సాగే ప్రయాణం ఇది. ఇందులో సోషల్ మెసేజ్ కూడా ఉంది. ఒక బలమైన స్త్రీని ఇందులో చూస్తారు’ అని నిర్మాత పూజా శరత్‌కమార్ అన్నారు. ఆమె సహోదరి వరలక్ష్మి శరత్‌కుమార్ నటించి, దర్శకత్వం వహించిన క్రైమ్ థ్రిల్లర్ ‘సరస్వతి’కి పూజ శరత్‌కుమార్ నిర్మాత.
ఈ నెల 6న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం పూజా శరత్‌కుమార్ విలేకరులతో ముచ్చటించారు. ‘కోర్ట్ సీన్స్ ఈ కథలో కీలకం. ముఖ్యంగా ఓ కోర్ట్ సీన్లో 7 నిమిషాల సింగిల్ షాట్ ఒకటుంది. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నటిగా వరలక్ష్మిని మరో మెట్టుపై నిలబెట్టే సినిమా ఇది. గొప్ప విజన్‌తో తయారైన పాత్ర ప్రియమణిది. అదేంటో తెరపై చూస్తారు. ప్రకాష్‌రాజ్, నాజర్లతో పాటు అందరూ మనసుపెట్టి నటించారు. సాంకేతికంగా కూడా సినిమా నెక్ట్స్ లెవల్లో ఉంటుంది’ అని పూజా శరత్‌కుమార్ చెప్పారు.