Balkampeta Yellamma | హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డికి జోగినిలు శాపనార్థాలు పెట్టారు. బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ వద్ద సరైన ఏర్పాట్లు చేయలేదని జోగినిలు కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ గవర్నమెంట్, తెలంగాణ పోలీసు డిపార్ట్మెంట్ సర్వనాశనం అయిపోతదని శాపనార్థాలు పెడుతూ ఆగ్రహం వెలిబుచ్చారు.
తెలంగాణలో ప్రభుత్వ సరిగా లేదు.. పోలీసులు, అధికారులు ఏం చేస్తున్నారు. ఎల్లమ్మ అమ్మవారి రథోత్సవం రథోత్సవం లాగా లేదు. అంగరంగ వైభవంగా జరగాల్సిన రథోత్సవం వద్ద ఒక పబ్లిక్ లేదు. ప్రభుత్వం ఏం చేస్తుంది.. గుడి ఈవో ఏం చేస్తున్నాడు. అమ్మవారికి ఒక బ్యాండ్ లేదు.. డప్పు లేదు. ఒక భాజా లేదు. అమ్మవారిని షోఫ్ టప్తో మొక్కొద్దు.. మనసుతో మొక్కండి. మేం మనసుతో వస్తాం. నియమనిష్టలతో ఒక్క పొద్దు ఉండి బోనాలు చేస్తాం. మేం ఇక్కడికి వచ్చామన్న ఒక ఆనందం లేదు. ఎల్లమ్మ రథోత్సవం నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది అని జోగినిలు పేర్కొన్నారు. సీఎం డౌన్ డౌన్.. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ జోగినిలు నినాదాలు చేశారు.
రేవంత్ రెడ్డికి శాపనార్థాలు పెట్టిన జోగినిలు
బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ వద్ద ఏర్పాట్ల పై ఆగ్రహం వ్యక్తం చేసిన జోగినిలు. pic.twitter.com/1VHPLASQs0
— Telugu Scribe (@TeluguScribe) July 11, 2024
ఇవి కూడా చదవండి..
KTR | తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారని ఆశిస్తున్నా.. కేటీఆర్ ట్వీట్
వైసీపీ నేత వల్లభనేని వంశీపై కేసు నమోదు.. అరెస్టు తప్పదా!
Telangana | ప్రేమించిన యువతి తల్లిదండ్రులను చంపిన ఉన్మాది.. వరంగల్ జిల్లాలో దారుణం