Telangana | ప్రేమించిన యువతి తల్లిదండ్రులను చంపిన ఉన్మాది.. వరంగల్ జిల్లాలో దారుణం
Telangana | వరంగల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించిన యువతి తల్లిదండ్రులను ఓ ఉన్మాది దారుణంగా హత్య చేశాడు. అడ్డొచ్చిన యువతితోపాటు ఆమె సోదరుడిపై కూడా దాడికి తెగబడ్డాడు.
Telangana | వరంగల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించిన యువతి తల్లిదండ్రులను ఓ ఉన్మాది దారుణంగా హత్య చేశాడు. అడ్డొచ్చిన యువతితోపాటు ఆమె సోదరుడిపై కూడా దాడికి తెగబడ్డాడు.
వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం చింతల్‌తండాకు చెందిన బానోతు శ్రీనివాస్(45), సుగుణ(40) దంపతులు. వీరికి ఇద్దరు సంతానం. వాళ్ల కూతురు దీపిక గుండెంగ గ్రామానికి చెందిన యువకుడు నాగరాజు అలియాస్ బన్నీ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. గత ఏడాది నవంబర్‌లో ఇద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు. దీంతో యువతి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. అప్పుడు ఇరువర్గాలను పోలీసులు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం దీపికను తల్లిదండ్రులతో పంపించారు.
తల్లిదండ్రుల వద్దే ఉంటూ దీపిక హనుమకొండలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఈ క్రమంలో ఆమెకు తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న బన్నీ.. తన ప్రేమను కాదన్నారనే అక్కసుతో దీపిక తల్లిదండ్రులపై కోపం పెంచుకున్నాడు. వాళ్ల ఇంటికి వెళ్లి పెద్ద తల్వార్‌తో దాడికి తెగబడ్డాడు. అడ్డొచ్చిన దీపిక, ఆమె సోదరుడు మదన్‌పై కూడా దాడి చేశాడు. ఇది గమనించిన కుటుంబసభ్యులు వారిని నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో సుగుణ అక్కడికక్కడే మృతిచెందగా.. శ్రీనివాస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. దీపిక, మదన్‌ను మెరుగైన వైద్యం కోసం హనుమకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ప్రేమిస్తున్నానని వెంటపడుతున్నాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం దీపిక ఇంటికి వచ్చిన బన్నీ తల్వార్‌తో ఆమె తల్లిదండ్రులపై దాడి చేశాడు. అడ్డొచ్చిన దీపిక, ఆమె సోదరుడిపై కూడా తల్వార్‌తో బన్నీ దాడి చేశాడు. ఈ ఘటనలో బానోతు శివ, సుగుణ అక్కడికక్కడే మృతిచెందారు. దీపిక, ఆమె సోదరుడు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడు బన్నీని అరెస్టు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

