Bakka Judson | హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత బక్క జడ్సన్ ఆరోగ్య పరిస్థితి విషమించింది. నిరుద్యోగుల సమస్యలపై గత పది రోజులుగా తన ఇంట్లోనే బక్క జడ్సన్ నిరాహార దీక్ష చేస్తున్నారు. శుక్రవారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. కనీసం లేచి కూర్చోనేందుకు చేత కావడం లేదు.
బక్క జడ్సన్‌ను పరామర్శించేందుకు ఆయన ఇంటికి బీఆర్ఎస్ నాయకులు రజినీ సాయిచంద్ వెళ్లారు. జడ్సన్ ఆరోగ్య స్థితిని చూసి ఆమె చలించిపోయారు. తక్షణమే అంబులెన్స్‌కు ఫోన్ చేసి పిలిపించారు. స్పృహ లేని జడ్సన్‌ను దుప్పట్లో వేసుకుని మోసుకెళ్లారు. అనంతరం అంబులెన్స్‌లో ఎక్కించుకుని ఆస్పత్రికి తరలించారు.
తండ్రి ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందుతున్న జడ్సన్ కూతుర్ని రజనీ సాయిచంద్ ఓదార్చారు. నాన్నకు ఏం కాదమ్మ అంటూ ఆమె ధైర్యాన్ని నింపారు. ఇక ఇదే సందర్భంలో జడ్సన్ ఇంటి వద్ద ఉన్న పోలీసులపై రజనీ సాయిచంద్ మండిపడ్డారు. జడ్సన్ ఆరోగ్య పరిస్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. జడ్సన్ నోటి నుంచి ఒక మాట రావడం లేదు. ఇక్కడ విధుల్లో ఉన్న పోలీసులు ప్రభుత్వానికి సమాచారం అందించాలి కదా..? ఆయనకు ఏమన్న అయితే ఎవరు బాధ్యులు..? ఇంత ఘోరమైన ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదు. మనషుల ప్రాణాలతో చెలగాటమాడుతారా..? అంటూ రజనీ సాయిచంద్ నిప్పులు చెరిగారు.
విషమించిన బక్క జడ్సన్ ఆరోగ్య పరిస్థితి..
నిరుద్యోగుల సమస్యల పై పది రోజులుగా దీక్ష చేసున్న బక్క జడ్సన్..
బక్క జడ్సన్ ఆరోగ్యం విషమించడంతో అంబులెన్స్ తెప్పించి హాస్పిటల్ కి తరలించిన బీఆర్ఎస్ నాయకురాలు రజినీ సాయిచంద్.. pic.twitter.com/sXlWIGnTyv
— Telugu Scribe (@TeluguScribe) July 12, 2024
ఇవి కూడా చదవండి..
MLA Prakash Goud | కాంగ్రెస్‌లో చేరిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్
CM Revanth | బలమైన వ్యవస్థగా ‘హైడ్రా’ ఉండాలి.. అధికారులకు సీఎం రేవంత్ సూచన
Bandi Sanjay | ఓయూలో తిరిగి నిరుద్యోగులతో మాట్లాడే దమ్ముందా? రాహుల్ గాంధీకి బండి సంజయ్ సవాలు
Samvidhaan Hatya Diwas | ఎమర్జెన్సీకి నిరసనగా జూన్ 25న సంవిధాన్ హత్యా దివస్