CM Revanth | బలమైన వ్యవస్థగా ‘హైడ్రా’ ఉండాలి.. అధికారులకు సీఎం రేవంత్ సూచన
CM Revanth | తెలంగాణ సచివాలయంలో హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్)పై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర అధికారులు హాజరయ్యారు.
CM Revanth | హైదరాబాద్ : తెలంగాణ సచివాలయంలో హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్)పై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా హైడ్రా విధివిధానాలపై చర్చ జరిగింది. హైడ్రా విధివిధానాలపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఔటర్ రింగ్ రోడ్డు వరకు 2 వేల చదరపు కి.మీ పరిధిలో హైడ్రా విధులు నిర్వహించేలా చూడాలని సీఎం ఆదేశించారు. ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అనధికారిక హోర్డింగ్స్, ఫ్లెక్సీలు తొలగించాలి. అపరాధ రుసుము వసూలు బాధ్యత హైడ్రాకు బదలాయించాలని ఆదేశించారు. జోన్ల విభజనలో పోలీస్ స్టేషన్ పరిధులు, అసెంబ్లీ నియోజకవర్గ పరిధులు పూర్తిగా ఒకే జోన్లో వచ్చేలా జాగ్రత్త వహించాలన్నారు సీఎం.
నాళాలు, చెరువులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణల విషయంలో నిబంధనలు కఠినతరం చేసేలా అధ్యయనం చేయండని అధికారులను సీఎం ఆదేశించారు. హెచ్ఎండీఏ, వాటర్ వర్క్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్, మున్సిపల్ విభాగాల మధ్య ఎప్పటికప్పుడు సమన్వయం ఉండేలా చూడాలి. ఒక బలమైన వ్యవస్థగా హైడ్రా ఉండాలి. అవసరమైతే ప్రత్యేక నిధులు కేటాయించే అంశాన్ని పరిశీలించండి. అసెంబ్లీ సమావేశాల్లోగా పూర్తిస్థాయి విధివిధానాలు రూపొందించండని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశించారు.
ఇవి కూడా చదవండి..
Samvidhaan Hatya Diwas | ఎమర్జెన్సీకి నిరసనగా జూన్ 25న సంవిధాన్ హత్యా దివస్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

