Bandi Sanjay | ఓయూలో తిరిగి నిరుద్యోగులతో మాట్లాడే దమ్ముందా? రాహుల్ గాంధీకి బండి సంజయ్ సవాలు
Bandi Sanjay | బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నిరుద్యోగం అంటువ్యాధిలా వ్యాపిస్తోందని రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. మీ పార్టీయే తెలంగాణలో అధికారంలో ఉంది కదా... ఉస్మానియా యూనివర్శిటీలో తిరిగే దమ్ముందా?’’ అంటూ సవాలు విసిరారు.
Bandi Sanjay | బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నిరుద్యోగం అంటువ్యాధిలా వ్యాపిస్తోందని రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. మీ పార్టీయే తెలంగాణలో అధికారంలో ఉంది కదా… ఉస్మానియా యూనివర్శిటీలో తిరిగే దమ్ముందా?’’ అంటూ సవాలు విసిరారు. ఓయూకి వెళ్లి నిరుద్యోగులను కలిసి వాళ్ల సమస్యలపై మాట్లాడగలరా అని ప్రశ్నించారు. హైదరాబాద్ శివారు శంషాబాద్ సమీపంలోని మల్లికా కన్వెన్షన్‌లో జరిగిన బీజేపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ చేసిన మోసాలను గుర్తించి బీజేపీకి 8 ఎంపీ సీట్లు అందించారని తెలిపారు.
తెలంగాణలో నిరుద్యోగం అంటువ్యాధిలా వ్యాపిస్తుందని బండి సంజయ్ విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచి ఏడు నెలలైనా ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీయే అంటువ్యాధి లాంటిదని మండిపడ్డారు. మోదీ రోజ్ గార్ మేళాతో 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తోందని. అయినా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నిరుద్యోగం అంటువ్యాధిలా విస్తరిస్తోందని రాహుల్ గాంధీ చెప్పడం సిగ్గు చేటు అని విమర్శించారు.
తెలంగాణ ప్రజలకు, బీజేపీకి విడదీయరాని బంధం ఉందని అన్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో లక్ష్మణ్ ఆధ్వర్యంలో 4 ఎంపీ సీట్లను అందించారు. మొన్నటి ఎన్నికల్లో 8 ఎంపీ సీట్లు, 8 ఎమ్మెల్యే సీట్లు అందించి కాంగ్రెస్‌కు బీజేపీయే ప్రత్యామ్నాయం అని నిరూపించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను చూసి మోసపోయామని తెలుసుకున్న ప్రజలు 8 ఎంపీ సీట్లు గెలిపించి మోదీకి పట్టం కట్టారని తెలిపారు.
మోదీ ప్రభుత్వం మళ్లీ వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తారని, రాజ్యాంగాన్ని మారుస్తారని కాంగ్రెస్ విష ప్రచారం చేసినా ప్రజలు నమ్మలేదని అన్నారు. కార్యకర్తల కష్టార్జితంతోనే బీజేపీ అధికారంలోకి వచ్చిందని బండి సంజయ్ తెలిపారు. కార్యకర్తలు తమ భుజంపై కాషాయ జెండాను మోశారని.. వారందరికీ తన సెల్యూట్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

