T Square | హైదరాబాద్ : న్యూయార్క్‌లోని టైమ్ స్క్వేర్ లాంటి బిల్డింగ్ మాదిరి హైదరాబాద్‌లోని రాయదుర్గం నాలెడ్జ్ సిటీ సమీపంలో.. టీ స్క్వేర్ పేరుతో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. రాష్ట్ర పరిశ్రమలు మౌలిక సదుపాయాల సంస్థ(టీజీఐఐసీ) ఆధ్వర్యంలో టీ స్క్వేర్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది.
ఈ మేరకు టీజీఐఐసీ టెండర్లు ఆహ్వానించింది. మధ్య, దిగువ మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండడంతో పాటు, స్థానిక ప్రజలకు ఆహ్లాదాన్ని కలిగించేలా టీ స్క్వేర్ నిర్మాణం ఉండాలని నిర్ణయించారు. రోజువారి పనులతో క్షణం తీరిక లేకుండా ఉండే వారికి టీ స్క్వేర్‌లో జరిగే ఈవెంట్లతో ఆహ్లాదకర వాతావరణం కల్పించాలని అధికారులు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి..
CM Revanth | బలమైన వ్యవస్థగా ‘హైడ్రా’ ఉండాలి.. అధికారులకు సీఎం రేవంత్ సూచన
Bandi Sanjay | ఓయూలో తిరిగి నిరుద్యోగులతో మాట్లాడే దమ్ముందా? రాహుల్ గాంధీకి బండి సంజయ్ సవాలు
Samvidhaan Hatya Diwas | ఎమర్జెన్సీకి నిరసనగా జూన్ 25న సంవిధాన్ హత్యా దివస్