వేములవాడ : ఓ ఇంట్లో చోరీకి ప్రయత్నించిన దొంగను(Thief) కాలనీ వాసులు చాకచక్యంగా పట్టుకొని చెట్టుకు కట్టేశారు. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో(Vemulawada) బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వేములవడ పట్టణం గాంధీనగర్‌లో తెల్లవారుజామున దొంగతనానికి యత్నించిన నిందితుడిని పట్టుకొని కాలనీ వాసులు పోలీసులకు అప్పగించారు. చేతులకు గ్లౌజులు, ముఖంపై టవల్ వేసుకుని సీసీ కెమెరాకు చిక్కకుండా దొంగతనానికి ప్రయత్నించాడు. సీసీ కెమెరాల ద్వారా గమనించిన స్థానికులు దొంగను పట్టుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘట స్థలానికి చేరుకున్న పోలీసులు దొంగను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Harish Rao | మహా కుంభమేళాలో తొక్కిసలాట ఘటనపై హరీశ్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి
KTR | ఇస్రో 100వ ప్రయోగం సక్సెస్.. శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్