Harish Rao | హైదరాబాద్ : ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభమేళాలో తొక్కిసలాట జరిగి 15 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభమేళాలో తొక్కిసలాట జరిగి పదుల సంఖ్యలో భక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటన కలిచి వేసిందని హరీశ్‌రావు తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆప్తులను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న వారిని ఆదుకోవాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రధాని నరేంద్ర మోదీకి, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు.
మౌని అమావాస్య సందర్భంగా అమృత స్నానంలో పాల్గొనేందుకు లక్షల సంఖ్యలో భక్తులు త్రివేణి సంగమంకు చేరుకున్నారు. అయితే ఇవాళ తెల్లవారుజామున 3 గంటల సమయంలో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో 15 మంది మృతిచెందారు. మరో 50 మందికిపైగా గాయపడినట్లు తెలుస్తోంది. ప్రయాగ్‌రాజ్‌లోని స్వరూపరాణి ఆస్పత్రికి మృతదేహాలను తరలించారు. అక్కడ పోస్టు మార్టం నిర్వహించనున్నారు.
ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభమేళాలో తొక్కిసలాట జరిగి పదుల సంఖ్యలో భక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటన కలిచి వేసింది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.
ఆప్తులను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న వారిని @PMOIndia , @CMOfficeUP ఆదుకోవాలని, క్షతగాత్రులకు మంచి వైద్యం అందించాలని విజ్ఞప్తి…
— Harish Rao Thanneeru (@BRSHarish) January 29, 2025
ఇవి కూడా చదవండి..
KTR | ఇస్రో 100వ ప్రయోగం సక్సెస్.. శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్
కొమురవెల్లిలో అఘోరి హల్చల్.. కత్తితో భక్తులపైకి దూసుకెళ్లి.. ద్వారాన్ని పగులగొట్టే యత్నం
Panchayat Elections | జూన్‌లోనే పంచాయతీ ఎన్నికలు.. డైలామాలో కాంగ్రెస్ సర్కార్!