Aquib Nabi | దూసుకొస్తున్న బారాముల్లా ఎక్స్‌ప్రెస్.. టీమిండియా అరంగేట్రానికి వేళైందిగా..!
Aquib Nabi : జమ్మూ కశ్మీర్ జట్టు విజయంలో కీలకమైన ఒకేఒక్కడు.. అకీబ్ నబీ (Aquib Nabi). టోర్నీ ఆసాంతం నిలకడగా రాణించి 67 ఏళ్ల కలను సాకారం చేసిన ఈ బారాముల్లా ఎక్స్‌ప్రెస్‌గా.. బంతికంటే వేగంగా భారత జట్టు వైపు దూసుకొస్తున్నాడు.
Aquib Nabi : నిత్యం తుపాకుల చప్పుళ్లు.. బాంబు పేలుళ్లు వినిపించే జమ్మూ కశ్మీర్ భారత క్రికెట్లో సంచలనం సృష్టించింది. ఊహకందని విధంగా పెద్జ జట్లకు షాకిస్తూ ఫైనల్ చేరిన జేకే టీమ్.. కర్నాటకను నిలువరించి తొలిసారి రంజీ విజేతగా అవతరించింది. జమ్మూ కశ్మీర్ జట్టు విజయంలో కీలకమైన ఒకేఒక్కడు.. అకీబ్ నబీ (Aquib Nabi). టోర్నీ ఆసాంతం నిలకడగా రాణించి 67 ఏళ్ల కలను సాకారం చేసిన ఈ బారాముల్లా ఎక్స్‌ప్రెస్‌గా.. బంతికంటే వేగంగా భారత జట్టు వైపు దూసుకొస్తున్నాడు. తన అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో ఇప్పటికే సెలెక్టర్ల దృష్టిలో పడిన పేస్ గన్ టీమిండియా అరంగేట్రానికి సిద్ధంగా ఉన్నాడు.
క్రికెట్లో రాణించాలంటే మెరుగైన వసతులు ఉండాలి. కానీ, అరకొర వసతుల నడమ ఆత్మవిశ్వాసమే ఆలంబనగా దేశవాళీలో సంచలనంగా మారాడు ఆకీబ్ నబీ. ఉగ్రదాడులు.. తుపాకుల గర్జనతో కల్లోలిత ప్రాంతంగా పేరొందిన జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా నుంచి దూసుకొచ్చాడీ పేసర్. సీజన్ సీజన్‌కు మరింత రాటుదేలిన అతడు.. రంజీ ట్రోఫీకి ముందే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 15 వికెట్లతో వార్తల్లో నిలిచాడు. ఈసారి రంజీ ట్రోఫీతో జమ్మూకశ్మీర్ తురుపుముక్కగా అవతరించిన అకీబ్.. జమ్మూ కశ్మీర్ చిరకాల స్వప్నం సాకారమవ్వడంలో కీలకమయ్యాడు.
Big wicket of KL Rahul 🔥
🎥 Watch Auqib Nabi’s delivery that gave J&K the massive breakthrough and a crucial early wicket in the #RanjiTrophy Final!
Updates ▶️ https://t.co/G0ytZLEyNB@IDFCFIRSTBank pic.twitter.com/y92jjuPebT
— BCCI Domestic (@BCCIdomestic) February 26, 2026
బంతిని రెండువైపులా స్వింగ్ చేయగల నేర్పు, కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బ్యాటర్లను బోల్తొ కొట్టించగల సమర్ధుడైన అకీబ్ రంజీ ట్రోఫీలో వికెట్ల పండుగ చేసుకున్నాడు. ఆరంభంలోనే కాకుండా కీలకమైన క్వార్టర్, సెమీస్, ఫైనల్లోనూ నిప్పులు చెరిగి ఐదేసీ వికెట్లతో జట్టు విజయాల్లో భాగమయ్యాడు. టైటిల్ పోరులో కర్నాటక జట్టుకు షాకిస్తూ డేంజరస్ కేఎల్ రాహుల్(KL Rahul), కరుణ్ నాయర్, స్మరన్ రవిచంద్రన్‌ల వికెట్ తీసి జమ్మూకశ్మీర్ విజయానికి దారులు వేశాడు. ఏకంగా ఏడుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేయడ మామూలు విషయం కాదు. మొత్తంగా 60 వికెట్లతో ఔరా అనిపించి ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డును ఎగరేసుకుపోయాడీ స్పీడ్‌స్టర్.
Back-to-back rippers 🔥
Karun Nair ✅
Smaran Ravichandran ✅Auqib Nabi and J&K are on a roll in the Final 👌
Updates ▶️ https://t.co/G0ytZLEyNB@IDFCFIRSTBank | #RanjiTrophy pic.twitter.com/r9QAH28O8f
— BCCI Domestic (@BCCIdomestic) February 26, 2026
ఐపీఎల్ వేలంలో 8.40 కోట్లకు
రంజీ ట్రోఫీలో అకీబ్ ప్రదర్శనకు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఫిదా అయ్యాడు. త్వరలోనే బారాముల్లా ఎక్స్‌ప్రెస్ భారత జట్టుకు ఆడడం ఖాయమని, ఇంగ్లండ్ సిరీస్‌తోనే అరంగేట్రం చేయించాలని దాదా పేర్కొన్నాడు. జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) గైర్హాజరీలో వికెట్ టేకర్‌గా జట్టుకు పనికొచ్చే బౌలర్ లోటును 29 ఏళ్ల అకీబ్ భర్తీ చేస్తాడని పలువురు మాజీలు అభిప్రాయపడుతున్నారు. ప్రతిభావంతుడైన ఈ బారాముల్లా పేసర్ నిరుడు ఐపీఎల్ వేలంలోనూ రికార్డు ధర పలికాడు. 19వ సీజన్ ఆక్షన్‌లో ఈ పేస్ గన్ను రూ.8.40 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Captials) దక్కించుకుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

