KTR | ఇస్రో 100వ ప్రయోగం విజయవంతం కావడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందనలు తెలిపారు. సైకిల్‌పై రాకెట్ విడిభాగాలను తీసుకెళ్లడం నుంచి100 ప్రయోగాల వరకు ఇంతకంటే గొప్ప ప్రయాణం ఇంకేముంటుందని అన్నారు. ఆర్యభట్ట నుంచి మంగళయాన్ వరకు, ఇవాల్టి 100వ ప్రయోగం వరకు మీరు సాధించిన విజయాలు భారతదేశాన్ని గర్వపడేలా చేశాయని కొనియాడారు.
విక్రమ్ సారాభాయి వంటి మహానుభావులు వేసిన బాటలో.. అనేక అవరోధాలను అధిగమిస్తూ ముందుకు సాగిన శాస్త్రవేత్తలు, సిబ్బంది అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇస్రో శాస్త్రవేత్తలు, సిబ్బంది అంకితభావం, పట్టుదల అలాగే అంతరిక్ష పరిశోధనపై ఉన్న అభిరుచి భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని కొనియాడారు. మీ కృషి భారతదేశౠన్ని అంతరిక్ష పరిశోధనలో ప్రపంచంలోనే అగ్రగామిగా చేసిందని అన్నారు. భవిష్యత్తులో మరెన్నో మైలు రాళ్లు, విశేష విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు.