కొమురవెల్లిలో అఘోరి హల్చల్.. కత్తితో భక్తులపైకి దూసుకెళ్లి.. ద్వారాన్ని పగులగొట్టే యత్నం
Komuravelli | సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి క్షేత్రంలో మంగళవారం అఘోరి హల్చల్ చేశారు. స్వామివారి దర్శనానికి వచ్చిన ఆమె ఆలయ ప్రధాన ద్వారం నుంచి దర్శనం చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.
Komuravelli | చేర్యాల, జనవరి 28 : సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి క్షేత్రంలో మంగళవారం అఘోరి హల్చల్ చేశారు. స్వామివారి దర్శనానికి వచ్చిన ఆమె ఆలయ ప్రధాన ద్వారం నుంచి దర్శనం చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. దిగంబరంగా అనుమతి ఇవ్వలేమని, వస్ర్తాలు ధరించి రావాలని ఆలయవర్గాలు సూచించడంతో బయటకు వచ్చి కారులో ఉన్న కత్తి తీసుకుని భక్తులపై దూయడంతో ఒక్కసారిగా వారు పరుగులు తీశారు.
పోలీసులు చేరుకుని ఆమెను శాంతింపజేసేందుకు యత్నించారు. వినకుండా ఆలయ ప్రధాన ద్వారం వద్దకు వెళ్లి తలుపులకు ఉన్న తాళాన్ని పగులగొట్టేందుకు యత్నించి విఫలమయ్యారు. వీడియో తీస్తున్న మీడియా ప్రతినిధిని కత్తితో అడ్డుకోవడంతో సెల్‌ఫోన్ పగిలిపోయింది. ఆలయవర్గాల విజ్ఞప్తితో అఘోరి వస్ర్తాలు ధరించి వచ్చి స్వామి వారిని దర్శించుకుని వెళ్లిపోయారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

