తుంగతుర్తి, ఫిబ్రవరి 28 : తాను పుట్టిన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గానుగుబండ గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని ఆ గ్రామ వాసులు త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డిని కోరారు. ఈ మేరకు శనివారం ఆయనను హైదరాబాద్‌లోని లోక్ భవన్లో గ్రామ సర్పంచ్ మాతంగి వెంకటమ్మ కరుణాకర్ ఆధ్వర్యంలో గ్రామస్తులు కలిసి ఘనంగా సన్మానించి విన్నవించారు. అనంతరం గవర్నర్‌కు గ్రామంలో గల వారి పాత ఇంటి స్థలాన్ని గ్రామ పంచాయతీకి ఇవ్వాలని, అలాగే గ్రామంలో రూ.50 లక్షల నిధులతో సీసీ రోడ్డు ఏర్పాటు చేయాలని, కర్విరాల నుండి గానుగుబండ, వెంపటి వరకు రోడ్డు నిర్మాణం చేయడంతో పాటు గ్రామంలో 50 ఇల్లు మంజూరు చేయాలని, బీసీ కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలని లిఖిత పూర్వకంగా ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.
సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి గ్రామాభివృద్ధి కోసం తన వంతు సహకారం అందిస్తానని గవర్నర్ ఈ సందర్భంగా హామీ ఇచ్చినట్లు సర్పంచ్ తెలిపారు. గవర్నర్‌ను కలిసిన వారిలో మాజీ ఎంపీపీ గుండగాని కవిత రాములు గౌడ్, అశోక్ రెడ్డి, చిత్తరంజన్ రెడ్డి, దయాకర్ రెడ్డి, గడ్డం శ్రీనివాసరెడ్డి, సుధాకర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ నల్లు రాంచంద్రారెడ్డి, వెలిశాల వెంకన్న, మాజీ ఎంపీటీసీ దుర్గయ్య, మాజీ సింగల్ విండో డైరెక్టర్ కుశలవరెడ్డి, యనగందుల రామచంద్రయ్య, పోలేపాక సోమయ్య, పోలేపాక రవి, పంజాల సతీశ్, భూపతి సైదులు, పోలేపాక సతీశ్, అబ్బగాని రవి, రమేశ్, సతీశ్ ఉన్నారు.