CM Revanth Reddy | హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. కుండపోత వర్షాలకు రాష్ట్రమంతా అతలాకుతలమైంది. ఈ క్రమంలో వరద సాయంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. భారీ వర్ష సూచన ఉన్న ప్రాంతాల్లో అధికారులు అలర్ట్గా ఉండాలని సీఎం సూచించారు. కలెక్టరేట్ల్లో కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
కమాండ్ కంట్రోల్ సెంటర్లో వ్యవస్థను సన్నద్దంగా ఉంచుకోవాలన్నారు సీఎం. భారీ వర్షాల సమయంలో అత్యవసర సేవల కోసం రాష్ట్రంలోని 8 పోలీస్ బెటాలియన్లకు ఎన్డీఆర్ఎఫ్ తరహాలో శిక్షణ ఇవ్వాలి. వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం రూ. 4 లక్షల నుంచి 5 లక్షలకు పెంచుతున్నట్లు సీఎం ప్రకటించారు.
ప్రజలకు జరిగిన నష్టంపై తక్షణమే అధికారులు స్పందించాలి. వరదల్లో చనిపోయిన పశువులు, మేకలు,గొర్రెలకు పరిహారం పెంచాలి. వరద నష్టంపైన కేంద్రానికి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. తక్షణమే సాయం కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలన్నారు. జాతీయ విపత్తుగా పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రాన్ని కోరాలని చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. వరద ప్రభావిత జిల్లాలు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట కలెక్టర్లకు తక్షణ సాయం కోసం 5 కోట్లు కేటాయించాలన్నారు.
ఇవి కూడా చదవండి..
Kollapur | కృష్ణానదిలో వరద నీటిలో చిక్కుకున్న చెంచులు, జాలర్లు
KTR | ముఖ్యమంత్రి గారు.. నా మీద కోపంతో నేతన్నల ప్రాణాలు బలిపెట్టొద్దు: కేటీఆర్
TGSRTC | భారీ వర్షాల ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణ మధ్య 560 బస్సులు రద్దు చేసిన టీజీఎస్ఆర్టీసీ