KTR | ముఖ్యమంత్రి గారు.. నా మీద కోపంతో నేతన్నల ప్రాణాలు బలిపెట్టొద్దు: కేటీఆర్
పదేండ్ల పాటు సిరి సంపదలతో కళకళలాడిన సిరిసిల్ల మళ్లీ ఉరిసిల్లగా మారుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆవేదన వ్యక్తంచేశారు. నేతన్నల పట్ల కాంగ్రెస్ సర్కార్ అనుసరిస్తున్న నేర పూరిత నిర్లక్ష్యం కార్మికుల ఉసురు తీస్తున్నదనిదని చెప్పారు.
హైదరాబాద్: పదేండ్ల పాటు సిరి సంపదలతో కళకళలాడిన సిరిసిల్ల మళ్లీ ఉరిసిల్లగా మారుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆవేదన వ్యక్తంచేశారు. నేతన్నల పట్ల కాంగ్రెస్ సర్కార్ అనుసరిస్తున్న నేర పూరిత నిర్లక్ష్యం కార్మికుల ఉసురు తీస్తున్నదనిదని చెప్పారు. నేతన్నల బతుకులకు భరోసా ఇచ్చే బతుకమ్మ చీరల ఆర్డర్లను నిలిపివేసి వాళ్ల పొట్ట కొట్టటం న్యాయమేనా అని ప్రశ్నించారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వమే వారికి ఉపాధి లేకుండా చేయటమేంటని నిలదీశారు. ఇది ప్రజాపాలనా? ప్రజల ప్రాణాలు తీసే పాలనా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సిరిసిల్ల నేతన్నలను ఆదుకోవాలని ముఖ్యమంత్రికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా మొద్దు నిద్ర నటిస్తున్నారని విమర్శించారు. ఇంకా ఎంతమంది ప్రాణాలు పోతే మీకు సోయి వస్తుందని ప్రశ్నించారు. సిరిసిల్ల నేతన్నలకు ఉపాధి కల్పించే చర్యలను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. మరొక్క ప్రాణం పోయినా అది ప్రభుత్వం చేసిన హత్యగానే భావించాల్సి ఉంటుందని ఎక్స్ వేదికగా చెప్పారు. తన మీద కోపంతో నేతన్నల ప్రాణాలు బలి పెట్టవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. వారికి తమ కన్నా ఎక్కువ మంచి చేసి వారి ప్రాణాలు నిలబెట్టాలన్నారు.
పదేళ్ల పాటు సిరి సంపదలతో కళకళలాడిన సిరిసిల్ల మళ్లీ ఉరిసిల్లగా మారుతోంది.
నేతన్నల పట్ల కాంగ్రెస్ సర్కార్ అనుసరిస్తున్న నేర పూరిత నిర్లక్ష్యం కార్మికుల ఉసురు తీస్తోంది.
నేతన్నల బతుకుకు భరోసా ఇచ్చే బతుకమ్మ చీరల ఆర్డర్లను
నిలిపివేసి వాళ్ల పొట్ట కొట్టటం న్యాయమేనా?ఆదుకోవాల్సిన… pic.twitter.com/8dOQ3f4wNI
— KTR (@KTRBRS) September 2, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

