– నల్లగొండ గడియారం సెంటర్లో బీజేవైఎం ఆధ్వర్యంలో ధర్నా
రామగిరి, ఆగస్టు 01 : ఇంజినీరింగ్ విద్యార్థులను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేవైఎం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు అంబాలపల్లి సుభాష్ యాదవ్ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్ లో విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బాధ్యతాయుతమైన సీఎం పదవిలో ఉండి చదువుకునే విద్యార్థులను కించపరచడం సిగ్గుచేటన్నారు. సీఎం విద్యార్థులకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అదే విధంగా రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ నిధులను వెంటనే విడుదల చేయాలన్నారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా నాయకులు మధు, నాగరాజు, భరత్, మంగ, గోపి, వంశీ, సైదులు, రమేశ్, అజయ్, ఆనంద్, సాయికుమార్, శివశంకర్, సాయి, అనిల్, చందు పాల్గొన్నారు.