-ప్రాణాలను అరచేతులు పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడిపిన చెంచులు
Kollapur | కొల్లాపూర్ : నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం అమరగిరి సమీపంలోని కృష్ణా నదిలోకి చేపల వేటకు వెళ్లే చెంచులు గుండ్లపెంట, కాటేకు వాగు, చీమల తిప్ప తదితర ప్రదేశాలలో స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. గత మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల ధాటికి కృష్ణానది ఉగ్రరూపం దాల్చడంతో చెంచులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని గడుపుతున్నారు. బయట ప్రపంచతో సంబంధాలు లేని ఈ ప్రాంతంలోని చెంచులు వరదల ధాటికి పడిన ఇబ్బందులు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.
2009లో వరదలు వచ్చినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నామని చెంచులు గుర్తు చేశారు. గత వరదల అనుభవం దృష్టిలో ఉన్న కూడా స్థానిక ప్రజా ప్రతినిధులు కృష్ణా నదిలో ఉన్న చీమలతిప్ప, గుండ్లపెంట, కాటేగువాగులపై ఉన్న చెంచులపై, జాలర్లపై నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.