శనివారం 23 జనవరి 2021
Telangana - Dec 03, 2020 , 11:53:46

నోముల భౌతిక‌కాయానికి సీఎం కేసీఆర్ నివాళి

నోముల భౌతిక‌కాయానికి సీఎం కేసీఆర్ నివాళి

న‌ల్ల‌గొండ : నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన నల్లగొండ జిల్లా నకిరేకల్‌ మండలం పాలెంలో జ‌రుగుతున్నాయి. ముఖ్య‌మంత్రి కేసీఆర్ గురువారం ఉద‌యం 11:30 గంట‌ల‌కు పాలెం చేరుకుని, నోముల భౌతిక‌కాయం వ‌ద్ద పుష్ప‌గుచ్ఛం ఉంచి నివాళుల‌ర్పించారు. నోముల కుటుంబ స‌భ్యుల‌ను ఓదార్చారు. సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు మ‌హ‌ముద్ అలీ, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, జ‌గ‌దీశ్ రెడ్డి, మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, ప‌లువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నివాళుల‌ర్పించారు.  


logo