Caste census : రాష్ట్రంలో కులగణన (Caste census) లెక్క వెల్లడైంది. ప్లానింగ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ సుల్తానియా (Sandeep Sultania) రాష్ట్రంలో కులగణన అంశంపై రూపొందించిన నివేదికను మంత్రివర్గ ఉపసంఘానికి అందజేశారు. మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై నివేదికపై చర్చించిన అనంతరం మంత్రి (Minister) ఉత్తమ్ కుమార్‌రెడ్డి (Uttam Kumar Reddy) మీడియాతో మాట్లాడారు. వెనుకబడిన తరగతులకు న్యాయం చేయాలనేదే తమ ఆకాంక్ష అని మంత్రి చెప్పారు. రాహుల్‌గాంధీ ఆకాంక్ష మేరకు రాష్ట్రంలో సామాజక, కులగణన సర్వే చేపట్టామని తెలిపారు.
మన దేశంలో స్వాతంత్య్రానికి పూర్వం నుంచి జనగణన జరుగుతున్నదని, అయితే అసలైన పేదలను గుర్తించేందుకు వీలుపడే కులగణన మాత్రం ఇంతవరకు జరగలేదని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, కులగణన చేయాలని అసెంబ్లీ తీర్మానించిందని తెలిపారు. బలహీనవర్గాల అభ్యున్నతికి అవసరమైన వివరాల సేకరణ కోసం కులగణన చేపట్టామని అన్నారు. సామాజిక కులగణన సర్వేలో 1,03,889 మంది ఎన్యుమరేటర్లు పాల్గొన్నారని చెప్పారు.
రాష్ట్రంలోని 96.9 శాతం మంది అంటే 3.54 కోట్ల మంది సర్వేలో పాల్గొని తమ వివరాలను అందించారని మంత్రి తెలిపారు. 3.1 శాతం మంది అంటే 16 లక్షల మంది వివిధ కారణాల వల్ల తమ వివరాలను అందించలేదని అన్నారు. రాష్ట్ర మొత్తం జనాభా 3.70 కోట్లని చెప్పారు. ప్రజల సామాజిక, ఆర్థిక, రాజకీయ, ఉపాధి తదితర అంశాలపై సమగ్ర అధ్యయనం జరిగిందని, సర్వేను అడ్డుకోవాలని కొందరు ప్రయత్నించినా అధికారులు విజయవంతంగా పూర్తిచేశారని తెలిపారు.
ఈ నెల 4న కులగణన నివేదికను రాష్ట్ర క్యాబినెట్ ముందు పెడుతామని, క్యాబినెట్లో చర్చించిన అనంతరం అసెంబ్లీలో ప్రవేపెడుతామని మంత్రి ఉత్తమ్ చెప్పారు. సమాజంలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ముందుకు వెళ్తోందని అన్నారు. మంత్రివర్గ ఉప సంఘం సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, దామోదర రాజనర్సింహ తదితరులు పాల్గొన్నారు.
PM Modi | ఢిల్లీలో త్వరలో కొత్త వసంతం.. మార్చి 8న మహిళల ఖాతాల్లో.. : ప్రధాని మోదీ
Arvind Kejriwal | మళ్లీ మాదే విజయం.. ఓటమి భయంతో బీజేపీ గూండాయిజం : కేజ్రీవాల్
Student gave birth | కాలేజీ టాయిలెట్లో విద్యార్థిని ప్రసవం.. ఆ తర్వాత..!
Tariffs War | దేశాల మధ్య సుంకాల యుద్ధం.. అమెరికా యాక్షన్.. కెనడా, మెక్సికో రియాక్షన్
Road accident | అదుపుతప్పి లోయలో పడ్డ బస్సు.. ఏడుగురు దుర్మరణం
Valentines Day | ప్రేమంటే ఏంటి.. ఎక్కడ మొదలవుతుంది? ఎన్ని రకాలుగా ఉంటుంది?