KTR | హైదరాబాద్ : తెలంగాణ గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకుని ఒకరిద్దరూ ప్రాణాలు కోల్పోగా, పలువురు ఆస్పత్రుల పాలయ్యారు. అంతేకాకుండా పాముకాట్లకు గురై చనిపోయారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ.. గురుకులాల బాట పట్టింది. బీఆర్ఎస్ గురుకుల బాటతో కాంగ్రెస్ సర్కార్లో ఎట్టకేలకు చలనం వచ్చిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు.
సంక్షేమ పాఠశాలలను సంక్షోభ పాఠశాలలుగా మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని కేటీఆర్ ధ్వజమెత్తారు. సామాన్య విద్యార్థుల్లో భయాందోళనలు, తల్లిదండ్రులలో ఆవేదన రేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠాలు చెప్పే చోట పాము కాట్లతో పసిబిడ్డల ప్రాణాలు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ పాలనలో విద్యార్థులు ఎవరెస్టు వంటి శిఖరాలను అధిరోహిస్తే .. ఏడాది కాంగ్రెస్ పాలనలో ఆసుపత్రి బెడ్లను ఎక్కించారని కేటీఆర్ విమర్శించారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో గురుకుల విద్యాలయాల్లో సీట్ల కోసం పోటీ పడితే ఏడాది కాంగ్రెస్ పాలనలో ఆసుపత్రుల్లో బెడ్ల కోసం పోటీ పడుతున్నారని పేర్కొన్నారు. దొంగలు పడ్డ ఆరు నెలలకు అన్నట్టు ఇప్పుడు గురుకులాల బాటపట్టారు. గురుకులాల మొక్కుబడి సందర్శన కాదు.. ఆ విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టండి. ఫొటోలకు పోజులు ఇవ్వడం కాదు.. పట్టెడు పనికొచ్చే బువ్వ పెట్టి పొట్టలు నింపండి. కెమెరాల ముందు హంగామా చేసుడు కాదు.. గురుకుల బిడ్డల గుండెచప్పుడు వినండి. మంది మార్బలంతో దండయాత్ర చేయకండి.. గురుకుల సమస్యలను తీర్చే ప్రయత్నం చేయండి అని కేటీఆర్ సూచించారు. చివరకు ఎట్లుండె తెలంగాణ.. ఎట్లాయె తెలంగాణ అని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
బిఆర్ఎస్ గురుకుల బాటతో కాంగ్రెస్ సర్కారులో ఎట్టకేలకు చలనం
సంక్షేమ పాఠశాలలను సంక్షోభ పాఠశాలలుగా మార్చి
సామాన్య విద్యార్థుల్లో భయాందోళనలు, తల్లిదండ్రులలో ఆవేదన రేపారు
పాఠాలు చెప్పే చోట పాము కాట్లతో పసిబిడ్డల ప్రాణాలు పోయాయి
బీఆర్ఎస్ పాలనలో విద్యార్థులు ఎవరెస్టు వంటి శిఖరాలను… pic.twitter.com/e4iNn1pIye
— KTR (@KTRBRS) December 14, 2024
ఇవి కూడా చదవండి..
Group-2 Exams | రేపట్నుంచి గ్రూప్-2 పరీక్షలు.. మంగళసూత్రానికి మాత్రమే అనుమతి
Telangana Talli | ఉద్యమతల్లే ముద్దు… బలవంతంగా రుద్దేతల్లి వద్దే వద్దు : జూలూరు గౌరీశంకర్