బాసెల్: స్విస్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత పోరాటం ముగిసింది. ఈ టోర్నీలో భారత ఆశలు మోస్తున్న హైదరాబాదీ షట్లర్ తరుణ్ మన్నెపల్లి క్వార్టర్స్‌లో నిష్క్రమించాడు.
శనివారం జరిగిన మెన్స్ సింగిల్స్ క్వార్టర్స్ పోరులో తరుణ్.. 19-21, 21-19, 13-21తో అంథోని గింటింగ్ చేతిలో పోరాడి ఓడాడు. తొలి రెండు గేమ్స్‌లో ఇరువురూ హోరాహోరీగా పోరాడి తలా ఒకటి గెలుచుకున్నా నిర్ణయాత్మక మూడో గేమ్‌లో మాత్రం తరుణ్ ఆరంభం నుంచే వెనుకబడి ఓటమి వైపు నిలిచాడు.