Group-2 Exams | హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా రేపు, ఎల్లుండి గ్రూప్-2 పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి టీజీపీఎస్సీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలంగాణ వ్యాప్తంగా 1,368 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలను ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించనున్నారు. 783 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్ 29న నోటిఫికేషన్ విడుదలైంది. పలు కారణాల వల్ల గ్రూప్-2 పరీక్ష వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ నెల 15, 16 తేదీల్లో పరీక్షలను నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు.
పరీక్షకు హాజరయ్యే వారు హాల్ టికెట్‌తో పాటు ఇటీవల దిగిన పాస్ పోర్టు సైజు ఫొటో, ప్రభుత్వంచే జారీ చేయబడ్డ ఏదైనా గుర్తింపు కార్డు తీసుకురావాలని అధికారులు సూచించారు. ఇక మహిళా అభ్యర్థులకు మంగళసూత్రం, గాజుల వరకే అనుమతించనున్నారు. ఇతర ఆభరణాలు ఉంటే అనుమతించమని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ చెప్పులే ధరించాలన్నారు. బెల్ట్‌లు, రిమోట్ కీస్‌కు అనుమతి లేదని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Allu Arjun: అండర్ ట్రయల్ 7697.. మంజీరా బరాక్‌లో అల్లు అర్జున్
Telangana Talli | ఉద్యమతల్లే ముద్దు… బలవంతంగా రుద్దేతల్లి వద్దే వద్దు : జూలూరు గౌరీశంకర్