KTR | హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమ చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాలి.. ఆ బాధ్యత మనందరిపై ఉన్నదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఇందు కోసం తెలంగాణ ఉద్యమ చరిత్ర నేపథ్యంతో పుస్తకాలను తేవాలని, ఉన్న పుస్తకాలను సమీకరించాలని కేటీఆర్ ఆకాంక్షించారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన తెలంగాణ సాహితీ సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి పుస్తకాలు వేల సంఖ్యలో రావాలని సాహితీవేత్తలు కోరారు. ఆ బాధ్యత నేను స్వయంగా తీసుకుంటాను. తెలంగాణలో ఉన్న అజ్ఞాత సూర్యులను వెలుగులోకి తీసుకువస్తాను. డీఎంకే మాజీ ఎమ్మెల్యే సీఆర్ శేఖర్.. ఇటీవలే నన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అంబేద్కర్, గాంధీ జీవితానికి సంబంధించిన పుస్తకాలు నాకిచ్చి ఫొటో దిగారు. ఈ పుస్తకాలు ఎందుకు తీసుకోచ్చావని అడిగితే.. మేం మా పార్టీ ఐడియాలజీకి సంబంధించిన బుక్స్ బహుమతిగా ఇస్తాం. హైదరాబాద్‌కు రాగానే మీకు పుస్తకాలు ఇచ్చేందుకు హిమాలయ బుక్ డిపో వెళ్లాను. అక్కడ తెలంగాణ చరిత్ర పుస్తకాలు లేవు.. దొరికిన ఈ రెండు పుస్తకాలు ఇచ్చాను అనేసరికి కొద్దిగా మనసులో గాయమైనట్లు అనిపించింది. మనసు చివ్వుక్కుమంది. కాబట్టి తెలంగాణ ఉద్యమ చరిత్ర పుస్తకాలు చాలా రావాల్సిన అవసరం ఉంది. చాలా మంది పుస్తకాలు రాశారు. ఇవాళ పరిమితమైన స్థాయిలో ఇక్కడ పుస్తక ప్రదర్శన నిర్వహించాం.వచ్చే ఏడాది బ్రహ్మాండంగా చేసుకుందాం. వేల పుస్తకాలు సమీకరిద్దాం. ఈ సాహితీ కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి రెండు కమిటీలు ఏర్పాటు చేస్తామని కేటీఆర్ తెలిపారు.
తెలంగాణ ఉద్యమానికి మూడు పార్శ్వాలు ఉన్నాయని ప్రొఫెసర్ జయశంకర్ చెబుతుండేవారు. ఒకటి భావజాల వ్యాప్తి.. అంటే ప్రజలకు మోసం జరిగినప్పుడు, ప్రభుత్వాలు ప్రజలను విస్మరించినప్పుడు ఎప్పటికప్పుడు చర్చ జరగాలి. రెండోది ఆందోళన పథం.. సందర్భం వచ్చినప్పుడు ఆందోళన జరగాలి. లగచర్ల, అదానీ విషయంలో సందర్భానుసారంగా ఆందోళన నిర్వహించాం. ఆందోళన పథంలో వెనుకాడొద్దు. మూడోది ప్రజాస్వామ్య ప్రక్రియ.. ప్రజాస్వామికంగానే మన హక్కులను, డిమాండ్లను నెరవేర్చుకోవాలి. ఈ మూడింటిలో కవులు, కళాకారులు, సాహితీవేత్తల పాత్ర చాలా ముఖ్యం. కాబట్టి తెలంగాణ చరిత్రను భవిష్యత్ తరాలకు అందజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కేటీఆర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | హైకోర్టులో మాజీ మంత్రి హరీశ్‌రావు క్వాష్ పిటిషన్
KTR | వచ్చే ఏడాది నుంచి విస్తృతంగా సాహితీ కార్యక్రమాలు నిర్వహిస్తాం : కేటీఆర్
KTR | కేసీఆర్ మీద కోపంతో.. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చితే చరిత్ర క్షమించదు : కేటీఆర్