Harish Rao | హైదరాబాద్ : మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పంజాగుట్ట పోలీసు స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలని హరీశ్‌రావు పిటిషన్లో పేర్కొన్నారు. పంజాగుట్ట పీఎస్‌లో తనపై తప్పుడు కేసు నమోదు చేశారని హరీశ్‌రావు పేర్కొన్నారు. రాజకీయ దురుద్దేశంతో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారని ఆయన తెలిపారు. నా ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్పై ముందుకు వెళ్లకుండా స్టే ఇవ్వాలని కోర్టును కోరారు. సిద్దిపేట కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా హరీశ్‌రావుపై కేసు నమోదైన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
KTR | వచ్చే ఏడాది నుంచి విస్తృతంగా సాహితీ కార్యక్రమాలు నిర్వహిస్తాం : కేటీఆర్
KTR | కేసీఆర్ మీద కోపంతో.. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చితే చరిత్ర క్షమించదు : కేటీఆర్
PSLV-C59 | తిరుమలను దర్శించుకున్న ఇస్రో బృందం.. మరి కొద్ది నిమిషాల్లో షార్ నుంచి రాకెట్ ప్రయోగం