KTR | హైదరాబాద్ : తెలంగాణ సీఎంవోపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యంగ్యాత్మకమైన ట్వీట్ చేశారు. బీసీ కులగణనపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా.. సమగ్ర కుటుంబ సర్వేను కేటీఆర్ అసెంబ్లీలో చూపించారు. కేటీఆర్ మాట్లాడిన తర్వాత ఎంసీఆర్హెచ్ఆర్డీ వెబ్సైట్ నుంచి సమగ్ర కుటుంబ సర్వే రిపోర్టును అధికారులు డిలీట్ చేశారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ స్పందించారు. వెల్డన్ తెలంగాణ సీఎంవో.. వాట్ ఏ ఫెంటాస్టిక్ పెర్ఫార్మెన్స్ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు వేశారు.
ఇవాళ తెలంగాణ ప్రజలకు అందుబాటులో ఉంచకుండా సమగ్ర కుటుంబ సర్వేను అధికారులు మాయం చేశారని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ తెలిపారు. అఫీషియల్‌గా ఉన్న సర్వే రిపోర్టును ఎందుకు మాయం చేయాల్సి వచ్చింది..? అని ప్రశ్నించారు. సర్వేపై కాంగ్రెస్ చెబుతున్న అవాస్తవాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు అని మన్నె క్రిశాంక్ స్పష్టం చేశారు.
Well done @TelanganaCMO 👏
What a fantastic performance https://t.co/qDJcgK7tdw
— KTR (@KTRBRS) February 4, 2025
ఇవి కూడా చదవండి..
Kishore Goud | బీసీ ప్రజలను మరోసారి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ.. మండిపడ్డ బీఆర్ఎస్ నేత కిశోర్ గౌడ్
KTR | అసెంబ్లీలో 42శాతం రిజర్వేషన్లు బిల్లు పెడుతరేమో అనుకున్నం : కేటీఆర్